Breaking News

విద్యుత్ శాఖ లో వినియోగదారునికే పెద్ద పీట

-వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు అహర్నిశలు కృషి
-ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , కే విజయానంద్
-ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కే.విజయానంద్ బాధ్యతల స్వీకరణ
-24x 7 విద్యుత్ సరఫరా , వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ పై ప్రత్యేక దృష్టి
-విద్యుత్ సంస్థలు ఆర్థికంగా, మౌలిక సదుపాయాల అభివృద్ధి పరంగా బలోపేతం కావాలి
-వ్యవసాయ విద్యుత్ కోసం సెకితో ఒప్పందం … దేశానికే ట్రెండ్ సెట్టర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి కే.విజయానంద్ గురువారం నాడు బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్య రంగం లోకి దిగారు. విద్యుత్ సంస్థలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారులకు 24x 7 నాణ్యమైన చౌక విద్యుత్ , అత్యుత్తమ సేవలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అందించేందుకు విద్యుత్ సంస్థలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు.
భవిష్యత్లో విద్యుత్ డిమాండ్ అందుకునేందుకు, విద్యుత్ సంస్థలు ఆర్థికంగా , మౌలిక సదుపాయాల అభివృద్ధి పరంగా బలోపేతం చేయాల్సిన అవసరముందని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఆయన అధ్యయనం చేసారు.
విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యుత్ సంస్థలకు వినియోగదారుడే కేంద్ర బిందువుగా ఉండాలని, వారికి మరింత మెరుగైన సేవలు అందచేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. భవిష్యత్లో విద్యుత్ డిమాండ్ ను అందుకోవడానికి నమ్మకమైన, నాణ్యమైన విధ్యుత్ ను వినియోగదారులకు సరఫరా చేయటానికి తమ శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో , అత్యుత్తమ పని తీరు కనబరుస్తున్న అధికారుల బృందం , ఇంజినీర్లు, మొత్తం సిబ్బంది సహకారం తో వినియోగదారుల అంచనాలను , విద్యుత్ డిమాండ్ ను అందుకోవడానికి విద్యుత్ సంస్థలు కృషి చేస్తాయని ఆయన తెలిపారు.
వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా , వచ్చే 25 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ కొనసాగించేందుకు దేశంలో తొలి సారిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సోలార్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సెకి) తో తక్కువ ధరకు 7000 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందం , రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోవటం అభినందనీయం అన్నారు. బహుశా ఏపీ సెకి ప్రాజెక్ట్ దేశంలో వ్యవసాయ రంగంలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగానికి గత 3 ఏళ్ల లో రూ 34,000 కోట్ల భారీ సబ్సిడీని అందచేయటం విద్యుత్ వ్యవస్థ బలోపేతం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కి నిదర్శనం అన్నారు .
వినియోగదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వారికి అత్యుత్తమ సేవలు అందించేందుకు తమ పరిధిలో అన్ని చర్యలు సత్వరమే తీసుకుంటామని తెలిపారు. వినియోగదారులకు 24x 7 విద్యుత్ సరఫరా, వ్యవసాయానికి పగటి పూటే ఉచిత విద్యుత్ సరఫరా పై ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టేరనే విషయాన్నీ ఆయన గుర్తుచేశారు.
అలాగే అత్యుత్తమ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీ విద్యుత్ సంస్థలను తీర్చిదిద్దటం పైన ప్రధానంగా దృష్టి సారించాలని తెలిపారు. ఇందుకు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు సహకారం అవసరముందన్నారు. ప్రజలకు నేరుగా సేవలు అందించే అవకాశమున్న విద్యుత్ శాఖ కు బాధ్యత వహించే అవకాశం రావటం తనకు ఎంతో సంతోషాన్ని ఇంచిందన్నారు . ఇందుకు ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న నెలలో దేశ వ్యాప్తంగా మరో సారి బొగ్గు కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి . ఈ దృష్ట్యా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు , గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించేందుకు , అలాగే థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుకోవడం పై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
విద్యుత్ రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉందని , దేశం ప్రసుత్తం ఎదుర్కొంటునంత బొగ్గు కకొరత సంక్షోభం గతం లో ఎన్నడూ చుడలేదన్నారు. ప్రస్తుతం నెల్లకొన్న ఉష్ణోగ్రతలు , భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ , తదితర అంశాలను పరిగణం లోకి తీసుకుని, విద్యుత్ రంగంలో రోజు జరుగుతున్న పరిణామాలను నిరంతరం అధ్యయనం చేయాలనీ ఆయన విద్యుత్ సంస్థలకు సూచించారు .
రాష్ట్రంలో బొగ్గు కొరతను అధిగమించేందుకు విదేశాల నుండి 31 లక్షల టన్నుల బొగ్గును (18 లక్షల టన్నులు – జెన్కో , 13 లక్షల టన్నులు – ఏ పీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ పీ డీ సి ఎల్ ) ) దిగుమతి చేస్తున్నట్లు జెన్కో ఎండీ, ట్రాన్స్కో ఎండీ , బి శ్రీధర్ తెలిపారు.
రాష్ట్రంలో బుధవారం నాడు విద్యుత్ డిమాండ్ 214.268 మిలియన్ యూనిట్లు ఉండగా, గత ఏడాది ఇదే రోజు 186.715 మిలియన్ యూనిట్లు మాత్రమే విద్యుత్ డిమాండ్ ఉందన్నారు . ఏ పీ జెన్కో థర్మల్ నుండి 62.60 మిలియన్ యూనిట్ , సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుండి 36.93, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుండి 17.39 మిలియన్ యూనిట్లు , సోలార్ నుండి 23.13, పవన విద్యుత్ నుండి 45.75 మిలియన్ యూనిట్లు మరియు బహిరంగ మార్కెట్ల నుండి 25.96 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ అందుకోవడం జరిగిందన్నారు. కరోనా సంక్షోభం లోను, దెస వ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరత సంక్షోభం నేపథ్యంలోనూ, రాష్ట్ర విద్యుత్ సంస్థలు వినియోగదారులకు 24x 7 కరెంటు సరఫరా అందించడంలో సఫలీకృతం అయ్యాయని శ్రీధర్ వివరించారు .
ఏ పీ జెన్కో ఎం డీ , ఎండీ ఏ పీ ట్రాన్స్కో, బీ శ్రీధర్ , జేఎండీ, ఏ పీ ట్రాన్స్కో , ఐ పృథ్వీ తేజ్, ఏపీట్రాన్స్కో జేఎండీ విజిలెన్స్ సెక్యూరిటీ, బీ మల్లారెడ్డి, డిస్కమ్ సీఎండీలు హెచ్ హరనాథరావు, జే పద్మ జనార్దనరెడ్డి, కె సంతోషరావు, నెడ్క్యాప్ ఎండీ ఎస్ రమణారెడ్డి విజయానంద్ కు అభినందనలు తెలిపారు.
గతంలో జాయింట్ కలెక్టర్, రంగారెడ్డి, కలెక్టర్ శ్రీకాకుళం, కలెక్టర్ నల్గొండ, భూభారతి కమిషనర్, ఏపీట్రాన్స్కో జాయింట్ ఎండీ , ఏపీజెన్కో మేనేజింగ్ డైరెక్టర్, సిఎండీ ఏపీట్రాన్స్కో , ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా విజయానంద్ పనిచేశారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *