విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని,వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం నాడు గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 11వ డివిజన్ లో 5,10వ సచివాలయ పరిధిలోని SRMT స్ట్రీట్,గమేలా స్ట్రీట్,తంగేళ్ళముడి వారి వీధి ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని(బాబీ) తో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ సంక్షేమ పథకాలు అమలు తీరును,చేస్తున్న అభివృద్ధి ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ,సచివాలయ,వాలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనను మన గడప వద్దకే చేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ దే అని,ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్ర పాలన చరిత్రలో నవసాకనికి నాంది పలికిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని కొనియాడారు. ఈ ప్రాంతాలలో స్వర్గీయ దేవినేని నెహ్రు హయాంలో చేసిన అబివృద్ది తప్ప గత ప్రభుత్వ హయాంలో చేసిందేం లేదు అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి చూసి ప్రజలలో రోజురోజుకు ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కేవలం తమ రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశం పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలలో అపోహలు కలిగిస్తున్నారని విమర్శించారు.ప్రజలకు వాస్తవాలు వివరించి వారిలో నెలకొన్న అపోహలు తొలగించడానికే ఈ గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గా ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధికి చేసింది సున్యం అలాంటిది ఇలాంటి వింత కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం మీద లేనిపోని నిందలు వేస్తె చుస్తే ఊరుకునే ప్రసక్తి లేదు.విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ చేసే షో రాజకీయాలు,చిల్లర రాజకీయాలు ప్రజలు నమ్మే పరిస్థి లేదు. ఒకపక్కన రాష్టం సంక్షేమమే దిశగా వెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక పని పాట లేక అప్పుడు అప్పుడు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మా వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఉడేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషం గా ఉన్నారు. మీరు ఎన్ని వేషాలు వేసిన రాబోయే 30 సవంత్సరాలు జగన్మోరెడ్డి గరే ముఖ్యమంత్రి గా ఉంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్టిన్ నాయకులు ముసునూరి సుబ్బారావు,కార్పొరేటర్లు ప్రవల్లిక,అంబెడ్కర్,వైస్సార్సీపీ నాయకులు గల్లా పద్మావతి,సందీప్,దుర్గా ప్రసాద్,చోటు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …