విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత కొన్ని సంవత్సరములుగా ప్రజల ఆదరాభిమానాలే పెట్టుబడిగా నాణ్యమైన స్వీట్స్ మరియు హాట్స్ తయారు చేస్తూ ప్రజలకు అందిస్తున్న ఎం.భీమరాజు, ఎం.వరలక్ష్మి ల ఆధ్వర్యంలో బావాజిపేట, 3వ లైన్, సాంబమూర్తి రోడ్డురోడ్డులో శుక్రవారం నగరంలో శ్రీ సాయి స్వీట్స్ & హోమ్ ఫుడ్స్ నూతన బ్రాంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపియస్ యఫ్ యన్ యల్ ఛైర్మన్ పి. గౌతమ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రారంభ సందర్భంగా ఎం.భీమరాజు మీడియాతో మాట్లాడుతూ నగరవాసులకు మరింత చేరువ కావాలని నాణ్యమైన స్వీట్స్ మరియు హాట్స్ మరిన్ని రకాలు తయారుచేసి అందిస్తామన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతా మన్నారు. ప్రస్తుత కరోనా దృష్ట్యా తయారీ చేస్తున్న వర్కర్స్ కు వ్యాక్సినేషన్ పరిసరాల పరిశుభ్రత కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన స్వీట్స్ మరియు హాట్స్ తయారు చేసే క్రమంలో నాణ్యత పై రాజీ లేకుండా నాణ్యమైన సరుకులు వాడతామని కాజు పిస్తా బాదం స్వచ్ఛమైన నెయ్యి తో రకరకాల స్వీట్ తయారు చేస్తామని అందుకే తమని ప్రజలు ఇప్పటికీ ఆదరిస్తున్నారని తెలిపారు. మావద్ద స్పెషల్ తాపేశ్వరం ఖాజా, ప్యూర్ ఘీ స్వీట్స్, బెంగాలీ స్వీట్స్, కాజు స్వీట్స్, హోమ్ ఫుడ్స్ తదితర వెరైటీ ఐటమ్స్ తమదగ్గర అందుబాటులో ఉంటాయన్నారు. అన్నిరకాల స్వీట్స్ వివాహాది శుభకార్యాలకు ఆర్డర్ల పై సప్లై చేస్తామన్నారు. అతి తక్కువ ధరలతో నగరవాసులకు పసందైన అనేక రకాల స్వీట్స్ మరియు హాట్స్ లను అందజేస్తున్నామని తెలియజేశారు. నగరవాసులకు అందుబాటు ధరలతో మరిన్ని వివిధ రకాల సరిక్రొత్త రుచులుతో కస్టమర్ దేవుళ్ళకు స్వీట్స్ మరియు హాట్స్ అందించటానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోనగర ప్రముఖులు, కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు.