విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అధిక నిధులు మంజూరు చేపించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ లో 12లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ మరియు వల్లూరి వారి స్ట్రీట్ లో 10లక్షల రూపాయలు తో యూ.జి.డి నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారి ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంలో అయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ డివిజన్ లో గత మూడేళ్ళ కాలంలో ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేసి పూర్తి చేయడం జరుగుతుందని,అదేవిధంగా కాంట్రాక్టర్లకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి పెండింగులో ఉన్న నిర్మాణలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు ఎలాంటి నాణ్యత లోపం లేకుండా వీలు అయినంత త్వరగా ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాం అని తెలియజేసారు. పుప్పాల కుమారి ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు మా దృష్టి కి తీసుకొస్తు వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పూర్తిగా వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధిత మంత్రులు, అధికారుల చొరవతో కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించి అభివృద్ధి చేయడం జరుగుతుంది అని,మంచినీటి సమస్య లేకుండా పైప్ లైన్ ఏర్పాటు, వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కేవలం ప్రచారాలకు పరిమితం అయ్యి ఆయన రాజకీయ మనుగడ కోసం ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేయడం తగదు అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,శివాలయం ఛైర్మెన్ సుబ్బారెడ్డి, వైస్సార్సీపీ నాయకులు పుప్పాల రాజా, మేడా రమేష్, టీపీ రెడ్డి,రమాదేవి, మచ్చా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …