-36వ శానిటరీ డివిజన్లో పారిశుధ్య పనులు పరిశీలన- కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ శుక్రవారం 36వ డివిజన్ పరిధిలోని భావజీ పేట, రాజగోపాలచారి మార్కెట్, ఆంధ్ర రత్న రోడ్డు తదితర ప్రాంతాలలో ప్రధాన రహదారులు మరియు అంతర్గత రోడ్లలో పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షిస్తూ, డివిజన్ లో మెరుగైన పారిశుధ్య పరిస్థితి నెలకొల్పాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన సమయానికి ప్రధాన రోడ్లు శుభ్రం చేసిన వెంటనే అంతర్గత రోడ్లు శుభ్ర పరస్తూ, ప్రతి ఇంటి నుండి వేరు చేయబడిన చెత్తను ప్రతిరోజు క్రమం తప్పకుండా సేకరించాలని అన్నారు. ఈ సందర్బంలో ఆంధ్ర రత్న రోడ్డు నందలి డ్రైన్స్ నందు మురుగునీటి పారుదలను పరిశీలించి డ్రైన్ కొంత మేర పాడై ఉండుట గమనించి సదరు డ్రైయిన్ నిర్మాణం చేపట్టుటకు అవసరమగు అంచనాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇంచార్జి డా. సి. హెచ్ బాబు శ్రీనివాసన్ మరియు శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.