-బి.వి సుబ్బారెడ్డి మునిసిపల్ హై స్కూల్ విద్యార్ధిని సత్కరించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2021 -22 విద్య సంవత్సరానికి సంబందించి జరిగిన 10వ తరగతి పరిక్షలలో కండ్రిక బి.వి సుబ్బారెడ్డి మునిసిపల్ హై స్కూల్ విద్యార్ధిని 584 మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాల యందు మొదటి స్థానం సాదించిన పటాన్ మహానూబ్ సుల్తన ను నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాలువ కప్పి సత్కరించారు. భవిష్యత్తులో కూడా శ్రద్దగా చదువుకొని ఉన్నత శిఖరాలు అదిరోహించి మంచి కీర్తి ప్రతిష్టలు గడించి చదివిన పాఠశాల పేరును మరింతగా ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి.వై.ఇ.ఓ ఇన్ ఛార్జ్ కె.వి.వి.రాజు విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.