-న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా క్యాలిఫైడ్ టీచర్లతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ…
-విద్యార్థులకు ప్రాధమిక స్థాయి నుండే విద్యపై మంచి పునాది అందించాలనే లక్ష్యం…
-జిల్లా కలెక్టర్ యస్‌డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు `నేడు పథకం ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా క్యాలిఫైడ్ టీచర్లతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించి విద్యార్థులకు ప్రాధమిక స్థాయి నుండే మంచి పూనాది అందించాలనే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో నాడు` నేడు రెండవ దశ కింద 156 కోట్లతో 372 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ యస్. డిల్లీరావు తెలిపారు.
జిల్లాలో నాడు` నేడు మొదటి దశ కింద పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోటో ప్రదర్శనను శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు పరిశీలించి సమగ్ర శిక్ష అభయాన్, విద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాడు`నేడు మొదటి దశ కింద రూ.78.79 కోట్లతో 341 పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు లేకపోవడం వలన విద్యార్థిని విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదురుకునేవారు. అపరిశుభ్రమైన వాతావరణం ఆరకొరకు వసతులతో కనీస టాయిలెట్ల సౌకర్యం కూడా లేకపోడంతో ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు ఉండేదన్నారు. గౌవర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యావిదానంపై ప్రత్యేక దృష్టి పెట్టి నాడు`నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలని పూర్తిగా మార్చివేసి కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాడం వలన తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చెర్పించేదుకు ఆశక్తి చూపూతున్నారన్నారు. అత్యధునిక పాఠశాలలో భవనాలు మరమత్తులు నిర్వహించి నూతన భవనాలుగా తీర్చిదిద్దడంతోపాటు తరగతి గదులలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, బ్లాక్‌బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, ఫర్నిచర్ ఏర్పటు ఆధునాతన వసతులతో టాయిలెట్ల నిర్మాణం, రక్షిత త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతోపాటు కిచన్ షెడ్ల్‌ను నిర్మించినట్లు కలెక్టర్ వివరించారు. నాడు` నేడు రెండవ దశలో భాగంగా 156 కోట్ల రూపాయలతో 372 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటి దశలో 60 అధనపు గదుల నిర్మాణాలను చేపడితే రెండవ దశలో 736 అదనపు గదులను నిర్మింస్తున్నమని తెలిపారు. కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్దతి ద్వారా తల్లిదండ్రుల కమిటీకే పాఠశాల భవన నిర్మాణాలను అప్పగించడం వలన పారదర్శకంగా పనులను పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా క్యాలిఫైడ్ టీచర్లతో విద్యార్థులకు విద్యబోదనను అందించి ప్రత్యేక స్థాయి నుండే విద్యార్థులకు మంచి పూనాదులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోను అమలు చేయని విధంగా విద్యావిదానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు `నేడు కార్యక్రమాని మన రాష్ట్రంలో అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇతర ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా అత్యంత సుందరంగా పాఠశాల భవనాలను తీర్చిదిద్దండలో భాగస్వామ్యులైన పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ వారికి ప్రత్యేక దన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో సమగ్ర శిక్షణ అభియాన్ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ ఎ శేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారిణి శ్రీమతి రేణుక, సిక్టోరల్ ఆఫీసర్లు ఎల్ వెంకటేశ్వరరావు, ఎస్.రాంబాబు, కె.సుధాకర్, ఎస్ కె బాజాని తదితరులు పాల్గొన్నారు.