Breaking News

రైతుల సంక్షేమమే లక్ష్యంతో వ్యవసాయాన్ని పండుగగా మార్చిన జగనన్న..

-రైతులకు మూడు పంటలకు సరిపడ పుష్కలంగా సాగునీటిని అందిస్తాం..
-తూర్పు డెల్టాకు 1500 క్యూసెకులు పశ్చమ డెల్టాకు 500 క్యూసెకులు విడుదల..
-నెల రోజుల మందుగానే సాగునీరు విడుదల..
-జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రైతాంగానికి అవసరమైన నీటిని ముందుగానే విడుదల చేసి చిట్టచివరి భూముల వరకు సాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
ప్రకాశం బ్యారేజ్‌ నుండి ఖరీఫ్‌ పంటకు శుక్రవారం జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర మంత్రులు జోగిరమేష్‌, మేరుగ నాగార్జున ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పూజ కార్యక్రమాలు నిర్వహించి సాగునీటిని విడుదల చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జలాశయాలలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉండడంతో రైతాంగానికి ముందుగానే సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పులిచింతల, నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలాశయాలలో నీరు నిల్వ ఉండడంతోపాటు ఇంతర రాష్ట్రాలలోని కృష్ణానదీ పై ఉన్న బ్యారేజస్‌లలో కూడా నీరు సంమృదిగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ ఎడాది నెల రోజుల ముందుగానే నీటిని విడుదల చేస్తున్నామన్నారు. నవంబరు, డిసెంబరు నెలలలో సంభవించే తుఫానుల ప్రభావం నుండి పంటలను రక్షించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో వ్యవసాయం దండగా అంటూ సాగును నిలక్ష్యం చేసిన దృష్టితిని సాములంగా మార్చి వ్యవసాయాన్ని పండుగగా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. రెండు పంటలు పండిరచే రైతులకు ముందుగానే సాగునీరు అందిస్తే మూడో పంటను కూడా పండిరచి ఆర్థికంగా లబ్ది పొందుతుందన్నారు. విత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నకు అవసరమైన సేవలను అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిట్ట చివరి భూముల వరకు రైతంగానికి అవసరమైన సాగునీటిని అందించడంతోపాటు విత్తనాలు ఎరువులు పురుగుమందులను అందుబాటులో ఉంచడం జరిగిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వమని రైతును రారాజు చేయాలనేసకల్పంతో ముందుకు వెళుతున్నామన్నారు. నెల రోజుల ముందుగానే కాలువలకు నీటిని విడుదల చేస్తుండంతో రైతాంగం సన్నద్దంగా ఉందన్నారు. మూడవ పంటగా అపరాలు పండిరచుకునేందుకు రైతులకు అవకాశం ఉన్నారు. ముందుగానే నీటిని విడుదల చేయాలనే క్యాబినేట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశామన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండు పంటలకు నీరు ఇచ్చారని అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు పంటలతో పాటు మూడవ పంట పండిరచుకునే అవకాశం కలుగజేస్తున్నామని మంత్రి అన్నారు.
సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ముందుగా నీటిని విడుదల చేయడం రైతులకు ఎంతో ఉపయోగమన్నారు. తద్వారా పంట నెల రోజుల ముందుగానే వచ్చే అవకాశం ఉందన్నారు. అన్నదాతల సాగు నీటి అవసరాలు తీర్చడంతోపాటు ఆర్‌బికెల ద్వారా రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి మేరుగ నాగర్జున అన్నారు.
సాగునీటి కార్యక్రమంలో రైతు సాధికారత సంస్థ చైర్మన్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, సింహద్రి రమేష్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి శశిభూషణ్‌ కుమార్‌, ఇఎన్‌సి నారాయణరెడ్డి, ఎస్‌ఇ తిరుమలరావు, ఇఇ గోపాల్‌, డిఇ కెవిఎస్‌ రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *