Breaking News

విజయవాడ నగరాన్ని అన్ని అంశాలలో అభివృద్ధి పరచిన ఘనత తమదే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నగరపాలక సంస్థ నందలి వివిధ గ్రాంట్ల క్రింద చేపట్టబడిన రహదారుల నిర్మాణ పనులకు మరియు రోడ్ల ప్యాచ్ వర్క్స్ లకు సంబందించి పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు.

సదరు సమావేశంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని అన్ని అంశాలలో అభివృద్ధి పరచిన ఘనత తమదేనని, చేసిన అభివృద్ధి పనులకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించుటయే దీనికి నిదర్శనం అని పలు జాతీయ సెమినార్ లలో ఆయా అంశాలపై సమర్పించిన ప్రతిపాదనలను ఖచ్చితంగా అమలు చేయుటం జరిగిందని అన్నారు. అదే విధంగా నగరపాలక సంస్థకు వివిధ గ్రాంట్ల క్రింద రాబడిన నిధులు వాటికీ సంబందించిన పనులు పూర్తి చేసిన పనులు నగర వ్యాప్తంగా రోడ్ల పై ఏర్పడిన గుంతలను యుద్దప్రాతిపదికన పూర్తి చేసిన వివరాలు సమగ్రంగా వివరించినారు. దీనికి సంబందించిన వివరాలు మరియు ఫోటోలు జతపరచటమైనది.

కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఏవిధమైన రాజీ లేకుండా ఎప్పటికప్పుడు వాటి నాణ్యతను రీబౌండ్ హ్యామర్ మరియు ఇతర నాణ్యత ప్రమాణాలు కొలుచు పరికరములతో స్వయంగా పరిశీలించిన తదుపరి మాత్రమే బిల్లు చెల్లింపు చేయుట జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎవరైనా అభివృద్ధి పనుల విషయంలో సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదులను స్థానిక సచివాలయం నందు కానీ లేదా నగరపాలక సంస్థ ఫిర్యాదుల విభాగమునకు తెలియజేసినచో అవసరమగు చర్యలు తీసుకోవటం జరుగునునని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ద్వారా ఎయిర్ కాలుష్య నివారణకు చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ పనులకు సంతృప్తి చెంది 15 వ ఆర్ధిక సంఘం ఎయిర్ పొల్యూషన్ గ్రాంట్ క్రింద 7 కోట్ల రూపాయల నిధులు కేవలం మన నగరపాలక సంస్థకు మాత్రమే మంజూరు చేయటం జరిగిందని అన్నారు. నగరపాలక సంస్థను అభివృద్ధి పదంలో నడుపుటకు అందరి సహకారం ఎంతో అవసరమని రాబోవు రోజులలో నగరాన్ని మరింతగా అభివృద్ధి పరచుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *