విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పక్క అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోపక్క రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం గా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11వ డివిజన్ 45,46 వార్డ్ సచివాలయాల పరిధిలోని రెల్లిస్ కాలనీ,మారుతి నగర్,హై స్కూలు రోడ్డు ప్రాంతాల్లో ఇంటిఇంటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైస్సార్సీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్తుంటే వారు బ్రహ్మరథం పడుతున్న తీరు చూస్తుంటే సంక్షేమ పథకాల పట్ల వారు సంతోషంగా ఉన్నారో అర్థం అవుతుంది అని అన్నారు. ఈ రెల్లిస్ కాలనీ నాడు స్వర్గీయ దేవినేని నెహ్రూ స్థానిక ప్రజలకు శంకుస్థాపన చేసి ఇక్కడి ప్రజలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చారని, మంత్రిగా ఈ కాలనీ అభివృద్ధి కి సంపూర్ణ సహాయం అందించారని తదనంతరం ప్రభుత్వాలు మారి నాయకులు మారిన అభివృద్ధి మాత్రం చేయలేదని మరలా నేడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో నా చేతుల మీదుగా అభివృద్ధి చేయడం గర్వంగా ఉందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లంచాలకు తావులేకుండా పారదర్శకంగా పధకాలు ఇంటివద్దనే అందజేసిస్తున్నాం అని,పధకాల అమలులో పరిపాలన లో మహిళలకె అగ్రభాగాన కేటాయించిన నాయకుడు జగన్ అని కొనియాడారు. కేవలం రాజకీయ మనుగడ కోసం పేపర్లు,టీవీ లలో కన్పించడానికే టీడీపీ నాయకులు డ్రామా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మంచి జరుగుతుంటే వారు ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని అవినాష్ విమర్శించారు.రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నాతో పాటు,లక్షలాది మంది ప్రజలు సమర్దిస్తున్నారని,రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని బాబీ, వైస్సార్సీపీ నాయకులు బంకా సందీప్,చిమటా బుజ్జి,చక్రవర్తి,దుర్గా ప్రసాద్,చోటు,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …