-‘‘ఛాయ్ విత్ ఫార్మర్స్’’లో జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదర్శ రైతుల అనుభవాలు, సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని రైతులు మరింత లాభసాటి సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు. జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక రంగాలలో తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించిన ఆదర్శ రైతులతో శనివారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆయన నివాసంలోని లాంజ్‌నందు ‘‘ఛాయ్ విత్ ఫార్మర్స్’’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖీ ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్న విధానాలను అడిగి తెలుసుకుని వారి నుండి సూచనలు సలహాలను స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలలో నూతన ఒరవడితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా రైతులు నిలుస్తున్నారన్నారు. శాస్త్రవేత్తల కంటే ఆదర్శ రైతుల స్వీయ అనుభవాలు రైతాంగానికి ఎంతో దొహాదపడతాయని అన్నారు. ఆదర్శ రైతు ఏ విధంగా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించరనే సమాచారంతో కూడిన బుక్‌లెట్లు డ్యాక్యూమెంట్‌లను రూపొందించి ఇతర రైతులు తెలుసుకునేలా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
వ్యవసాయంలో చెరువు మాధవరం గ్రామనికి చెందిన ఆదర్శ రైతులు జి. శ్రీను, బాణావతు సఖీయా, నున్న గ్రామనికి చెందిన చాగంటి వెంకటరెడ్డి కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన బల్లంకొండ సుబ్బారావులు వరి, పత్తి, మిరప పంటలలో నూతన వ్యవసాయ పద్దతులను అవలంభిస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్న విధానాన్ని వివరించారు.
ఉద్యాన పంటలలో రెడ్డిగూడెంకు చెందిన భరత్‌వర్మ, సిహెచ్ కృపారాజు, జి.కొండూరు మండల కోడూరు చెందిన యం సత్యశ్రీనివాస్, చంద్రర్లపాడు మండలం కోనాయ పాలంకు చెందిన కృష్ణరావు తదితర ఆదర్శ రైతులు మామిడి, అరటి, మిరప, నిమ్మ పంటలలో అనుసరిస్తున్న నూతన విధానాలను వివరించారు.
పశు సంవర్థకలో కొత్తూరు తాడేపల్లికి చెందిన ఏ శ్రీ పద్మ కంచకచర్ల మండల పెరికలపాడు చెందిన వి రవికుమార్, తుర్లపాడుకు గ్రామనికి చెందిన యం లియోనార్డ్‌లు తదితర ఆదర్శ రైతులు పశువుల పెంపకంలో మెలుకవలు పాటిస్తూ అధిక పాల, మాంసోత్పత్తులను సాధిస్తున్న విధానాలను వివరించారు.
ప్రోగ్రెసివ్ ఫిష్ అండ్ ష్రింప్ ఫార్మర్స్ అయిన జి కొండూరు మండలం కుంటి ముక్కల గ్రామనికి చెందిన వి సురేష్ రెడ్డి గూడెంకి చెందిన కె.ఎన్‌వి ప్రసాద్, పెదమడుగు పల్లి గ్రామనికి చెందిన సిహెచ్ వివి ఎం సత్యనారాయణ తమ అనుభవాలను జిల్లా కలెక్టర్‌కు వివరించారు.
‘‘ఛాయ్ విత్ ఫార్మర్స్’’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏఎన్‌వి అనితభాను, ఉద్యాన శాఖ జిల్లా అధికారి దయాకర్‌బాబు, పశుసంవర్థక శాఖ కె విద్యసాగర్, మత్స్య శాఖ జిల్లా అధికారి రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు.