-ప్రిన్సిపల్ సెక్రటరీ జి.ఎ.డి.వారికి ఫిర్యాదు.
-వినుకొండ రాజారావు.వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయడానికి అందుబాటులో ఉండాలని నాయకులకు బదిలీల్లో ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందని,అయితే దానికి భిన్నంగా నాయకులు, సంఘాలు వ్యవహరిస్తూ సాధించిందేమీ లేక కేవలం బదిలీల కోసం రాష్ట్ర స్థాయి సంఘాలు అన్నట్లుగా వ్యవహరిస్తుండటం బాధాకరమని, ఈ నాయకులు సాధించింది ఏమిలేదనే దానికి నిదర్శనమే పిఆర్ సి తర్వాత కార్యాలయాలకు పోలీసులతో రక్షణ ఏర్పాటును రాష్ట్ర ఉద్యోగులందరూ బహిరంగంగా చూశారని, రాష్ట్ర ఉద్యోగుల నుండి ప్రతిఘటన ఎదురవుతుందని బద్రతకోసం పోలీసు పహరలో ఉన్న నాయకులు ఉద్యోగుల కు చేసేది ఏమిలేదని తేటతెల్లమైందని,అయితే గతంలో నాయకులు ఉద్యోగుల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఉండేదని వారు లక్ష్య సాధనలో ముందు ఉండి పాటుపడే వారని నాడు ఉద్యోగులంటే సమాజంలో గౌరవం ఉండేదని, నేడు హక్కులు సాధించకపోగా కేవలం బదిలీల కోసం పరుగులు తీయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వము ఈ కోవలో ఆలోచన చేసి ఉద్యోగుల కు రావలసిన హక్కులను, రాయితీలను కాపాడలేని నాయకులకు,సంఘాలకు బదిలీలల్లో వెలుసుబాటును ప్రభుత్వం రద్దు చేయాలని,ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సాధారణ పరిపాలన వారికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు నేడు ప్రకాశం జిల్లా ఒంగోలులో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.