విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ బలిజ సంఘ విజయవాడ నగర శాఖ మరియు పాయకాపురం శాఖల అధ్వర్యంలో శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాజీ ప్రధాన కార్యదర్శి, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ బలిజ/పూసల కార్పొరేషన్ చైర్మన్ కోలా భవానీమణికంఠ మరియు రాష్ట్ర అధ్యక్షులు కోలా అశోక్ కుమార్ ముఖ్య అతిధులుగా విచ్చేసి పాయకాపురం నూతన కమిటీ, విజయవాడ పట్టణ కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర, జిల్లా, పట్టణ, గ్రామ స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేసుకొని కమిటీలన్నీ సమన్వయంతో పని చేస్తేనే కృష్ణ బలిజ సంఘమును అభివృద్ధిలో నడిపించగలమని, రాష్ట్ర కమిటీ సంఘ అభివృద్దే ధ్యేయముగా పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు కోలా అశోక్ కుమార్ చెప్పారు. చైర్మన్ కోలా భవాని మనికంట ప్రభుత్వ పరంగా ఎటువంటి సమస్యలకైనా కృష్ణ బలిజ సంఘీయులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. సీనియర్ అడ్వకేట్ బత్తుల సాయిబాబా మన కులము ఆర్థికముగా వెనుకబడినదే తప్ప కులహీనమైనది కాదని ప్రతి ఒక్కరు నేను కృష్ణ బలిజ సంఘీయుడనని చెప్పుకునేలా రాష్ట్ర కమిటీ, కార్పొరేషన్ వారు పని చేయాలన్నారు. రాష్ట్ర యువజన నాయకులు కోలా మణికంఠ కృష్ణ బలిజ సంఘ అభివృద్ధి కోసం, సంఘీయులు సమస్యలకోసం ఎంతవరకైనా పోరాడతామని చెప్పారు. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బత్తుల వరలక్ష్మి రాష్ట్ర జిల్లా పట్టణ స్థాయిలో మహిళా కమిటీలను ఏర్పాటు చేయమని అందుకు కృష్ణ బలిజ సంఘ మహిళలు ముందుకు రావాలని కోరారు. పాయకాపురం నూతన కమిటీ, విజయవాడ పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులు అధికార పత్రాలు అందుకని మా కర్తవ్యాలను నెరవేరుస్తామని మా పరిధిలో ఉన్న కృష్ణ బలిజ సంఘ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ గడ్డం రవి కిషోర్, అధ్యక్షులు, విజయవాడ నగర శాఖ, కృష్ణ బలిజ సంఘం మరియు గడ్డం కిరణ్ కుమార్, అధ్యక్షులు, పాయకాపురం శాఖ, కృష్ణ బలిజ సంఘం, ఎన్టీఆర్ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పాయకాపురం, విజయవాడ నగర సంఘ పెద్దలు, సంఘీయులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …