-అత్యంత ప్రతిష్టాత్మకంగా 24x 7 కరెంటు సరఫరా
-వినియోగదారులకు ప్రయోజనాల పరిరక్షణలో రాజి లేదు
-ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-రాష్ట్రంలో 6.68 ఎంటీవోఈ ఇంధన పొదుపు
-బీఈఈ సహకారంతో ఏపీ ఇంధన శాఖ ప్రణాళిక
-24×7 నాణ్యమైన చౌక విద్యుతే ప్రభుత్వ లక్ష్యం: ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-భవిష్యత్ ఇంధన డిమాండ్ అందుకోవడానికి ఇంధన సామర్ధ్య కార్యక్రమాలది కీలక పాత్ర
-ఇంధన సామర్థ్యం తో రాష్ట్ర ఆర్థికాభివృధి, విద్యుత్ రంగం బలోపేతం
-విద్యుత్ రంగంలో తీసుకునే ప్రతీ చర్య ప్రజలకోసమే: ఇంధన శాఖ మంత్రి
-విద్యుత్ రంగ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
-ఏపీ లో 6.68 ఎంటీవోఈ ఇంధన సామర్ధ్య లక్ష్య సాధనకు సహకరిస్తాం: బీఈఈ , సెక్రటరీ, ఆర్ కె రాయ్
-రాష్ట్రంలో ఇంధనం సామర్ధ్య రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించండి
-ఇంధన సామర్ధ్య రంగంలో ఏపీ రోల్ మోడల్ – బీఈఈ ప్రశంస
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 2030 నాటికల్లా 6.68 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని పొదుపు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఇంధన సామర్ధ్య కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ , ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఇందుకు సహకరిస్తుందన్నారు. కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో పెరగనున్న ఇంధన డిమాండ్ అందుకోవడానికి ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలే తక్షణ పరిష్కారమని చెప్పారు. ఇందుకోసమే ఇంధన రంగంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఇంధన సామర్ధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలకు ఇది దోహదపడుతుందని, ప్రతి కుటుంబం దీని వల్ల ప్రయోజనం పొందుతుందని తెలిపారు.
విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న అది ప్రజా ప్రయోజనాలు పరిరక్షించడం కోసమేనని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ రంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడదని స్పష్టం చేశారు.
24x 7 నాణ్యమైన చౌక విద్యుత్ సరఫరా కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.ఈ లక్ష్య సాధనకు ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. చౌక లో నాణ్యమైన , తగినంత విద్యుత్ లభ్యత రాష్ట్రములో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందన్నారు . దీనివల్ల 24x 7 విద్యుత్ సరఫరా మరింత పటిష్టమవుతుందని, ఇది అంతిమంగా పారిశ్రామిక , ఆర్థికాభివృద్ధికి ఉపకసరిస్తుందని పేర్కొన్నారు.
గతంలో కోవిడ్ సమయంలో వినియోగదారులకు, ఆస్పత్రులకు తదితర కేటగిరీలకు , ఇటీవల దేశ వ్యాప్తంగా ఎంతటి బొగ్గు కొరత సంక్షోభం ఉత్పన్నమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు నాణ్యమైన నమ్మకమైన కరెంటు ను అందచేయటంలో రాజి పడలేదని మంత్రి గుర్తుచేశారు.
రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు , ఆర్థిక వ్యవస్థ బలోపేతం , రాష్ట్రము లో ప్రతి కుటుంబ సంక్షేమానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నారు. ఇంధన పొదుపు, సామర్ధ్య పెంపు , ట్రాన్స్మిషన్ లాస్ తగ్గించుకోవడంలో, పునరుత్పాదక ఇంధన వనరులను పెంపొందించడం, వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం లో రాష్ట్ర విద్యుత్ రంగం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విద్యుత్ రంగంగా పేరు తెచ్చుకుందని మంత్రి గుర్తుచేశారు . మున్ముందు కూడా వినియోగదారుల అవసరాలు ఆకాంక్షలు అనుగుణంగా విద్యుత్ వ్యవస్థ పనిచేస్తుందని హామీ ఇచ్చారు
దేశాన్ని 2070 నాటికి కాలుష్య రహితంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంధన సామర్ధ్య కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని బీఈఈ కోరింది. దీనిలో భాగంగా బీఈఈ సెక్రటరీ ఆర్ కె రాయ్.. రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసిఎం) అధికారులతో ఆన్ లైన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు ద్వారా 2030 నాటికీ దేశంలో 45 శాతం ఇంధన వినియోగ అవసరం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు ఇంధన పొదుపు కార్యాచరణను తయారు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రోడ్ మ్యాప్ ను రూపొందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రాల ఇంధన సామర్ధ్య ప్రణాళికలు వివిధ రంగాల వారీగా ఇంధన పొదుపు అవకాశాలు గుర్తించడం జరుగుతుందన్నారు. వాటి ఆధారంగా, వచ్చే 5 ఏళ్లకు, అలాగే దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందన్నారు .
ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య పెంపు లక్ష్యాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలించిందన్నారు. అలాగే రాష్ట్ర ఇంధన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సత్వరమే చర్యలు తీసుకుందని ప్రశంసించారు. ఏపీని ఇంధన సామర్ధ్య రాష్ట్రంగా మార్చడం పట్ల ప్రభుత్వంకున్న నిబధ్దతకు ఇది నిదర్శనం అన్నారు. దీని వల్ల రాష్ట్రం అనేక విధాలుగా ప్రయోజనం పొందుతుందన్నారు. ఇందుకోసం ఇంధన సామర్ధ్య రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంధన సామర్ధ్య రంగంలో జాతీయ స్థాయిలో రూ.10.02 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. దీనివల్ల రాష్ట్ర ఆర్థికాభివృధితో పాటు ఉపాధి కల్పన, పర్యావరణం మెరుగవుతుందని పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యమైన 6.68 ఎంటీఓఈ ఇంధన పొదుపు సాధనకు అన్ని కీలక పరమైన రంగాలను భాగస్వాములుగా చేయవల్సిందింగా బీఈఈ కార్యదర్శి కోరారు. జాతీయ స్థాయి లక్ష్యమైన 150 ఎంటీఓఈ ఇంధనం పొదుపునకు ఇది దోహద పడుతుందని 887 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను 2030 నాటికీ తగ్గించడంలో కూడా దోహదకారి అవుతుందని తెలిపారు.
రాష్ట్రములో వార్షిక విద్యుత్ డిమాండ్ దాదాపు 66000 మిల్లియను యూనిట్లు ఉండగా అందులో దాదాపు 15000 మిలియన్ యూనిట్లు పొదుపు చేసే అవకాశం ఉందని ఏపీఎస్ఈసిఎం అధికారులు వివరించారు . ప్రధానంగా పారిశ్రామిక , మునిసిపల్, వ్యవసాయ , గృహ వినియోగ రంగాలలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
ఇందుకోసం ప్రస్తుతం రూపొందిస్తున్న రాష్ట్ర ఇంధన కార్యాచరణ ప్రణాళిక దోహదపడుతుందన్నారు. ఇందుకు సహకారం అందిస్తున్న బీఈఈ కు ఏపీఎస్ఈసిఎం అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.