Breaking News

రీ-ఎంప్లాయిడ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఎంపిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రీ-ఎంప్లాయిడ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు జరిగింది. ఈ సమావేశంలో రీ-ఎంప్లాయిడ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ నూతన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గా పి. రవి ప్రసాద్ రావు, ఉపాధ్యక్షులుగా ఆర్.శ్యామ్ సుందర్, కార్యదర్శి పి.రమేష్, కోశాధికారి ఏ.బి.నాయుడు, ఉప కార్యదర్శి జి.ఎన్.వి.వి.ప్రసాద్, ముఖ్య సలహాదారులుగా ఎమ్.ఎచ్.కే.సీ.చౌదరి, సి.హెచ్.వెంకట్ రావులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీ-ఎంప్లాయిడ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *