-ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇవ్వాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గ్లాస్ టంబ్లర్(గాజు గ్లాస్) గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు.”వైసీపీ హటావో ఏపీ బచావో” అనే నినాదంతో తాను ముందుకు వెళ్తున్నానని అందుకు టిడిపి,జనసేన, వామ పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.ఈ మేరకు ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, జనసేన అధ్యక్ష, కార్యదర్శుల కు బహిరంగ లేఖ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికల గుర్తు “గాజు గ్లాసు” అని తనది జాతీయ పార్టీ అని, ఎన్నికల కమీషన్ గుర్తించిందని అన్నారు. తనకు ప్రతిపక్షాలని మిత్రులేనని తనను ఆత్మకూరు ఎమ్మెల్యే గా గెలిపించాలని, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తానని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ లలో అన్ని సామాజిక వర్గాలు గాజు గ్లాస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ధనం, కులం, మతం అవినీతి ప్రభావం లేని రాజకీయాల కోసం, బడుగు బలహీన వర్గాలకు అందించడం కోసం స్థాపించిన పార్టీ తనదన్నారు.బహుజనులందరూ ఏకం కావాలని గాజు గ్లాసుకు గుర్తుకు ఓటు వేయాలని, బహుజనులు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అదే విధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం మధు, కాంగ్రెస్ పార్టీ శైలజానాథ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బరిలో లేనందున గాజు గ్లాసుకు ఓటు వేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. 2019 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కి గాజు గ్లాసు గుర్తు కేటాయించారని, ఈ గుర్తు పవన్ కళ్యాణ్ కు ఇష్టమని కావున జనసైనికులు ఓటు వేయాలని, అలాగే టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.