నగరి, నేటి పత్రిక ప్రజావార్త :
పురాతన ఆలయము నకు జీర్ణోద్ధరణ, మహా కుంభాభిషేక మహోత్సవం లో మంత్రి ఆర్కే రోజా సెల్వమణి దంపతులు పాల్గొన్నారు. శుక్రవారం నగరి మునిసిపాలిటీ ఏకాంబరకుప్పం మైన్ రోడ్ లో గల శ్రీ వరమూర్తి వినాయగర్ స్వామి వారి పురాతన ఆలయం లో కలశ పూజలు నిర్వహించి గోపురం పైన జరిగిన విశేష జీర్ణోద్ధరణ, మహా కుంభాభిషేక మహోత్సవం లో మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి మరియు కృష్ణా జిల్లా ఇంఛార్జి మంత్రి ఆర్కే రోజా సెల్వమణి దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ కుంభాభిషేక కార్యక్రమలో పాల్గొనడం తన అదృష్టం అని తెలిపారు. అలాగే నగరి పురప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించారు.
Tags nagari
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …