ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని నెరవేర్చిన నాయకుడు జగనన్న

-ఇచ్చిన హామీలు కాదు ఇవ్వని హామీలు కూడా ప్రజలకు అందించిన ఘనత మన ప్రభుత్వానిది
-హోమ్ మంత్రి తానేటి వనిత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషం స్పందన వస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం తాళ్లపూడి గ్రామంలో మంత్రి తానేటి వనిత పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత మూడు సంవత్సరాలలో ప్రతీ పేదవారికి ప్రయోజనం జరిగిందని, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అర్హులకు పథకాలను వర్తింపు చేస్తున్నామన్నారు. దళారుల ఆశ్రయించాల్సిన అవసరం లేదు, ఎవరి చుట్టూ తిరగనవసరం లేకుండా వాలంటీర్ల మీ ఇంటికి వచ్చి అర్హులను గుర్తించి పథకాలను వర్తింప చేస్తున్నారని మంత్రి తానేటి వనిత తెలిపారు. ప్రయోజనం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని ఇటువంటి ప్రభుత్వమే మళ్ళీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నా రు. జగనన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాదు ఇవ్వని హామీ లు కూడా అమలు చేస్తూ ప్రజల మనస్సులో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రి తెలిపారు.

మండల కేంద్రమైన తాళ్లపూడి లో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం మూడవ రోజు హోమ్ మంత్రి తానేటి వనిత గారు నిర్వహించారు. హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రజలను కలుసుకుంటూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్ని అందుతున్నాయా? లేదా ?,సంతృప్తికరమైన పరిపాలన సాగుతుందా? లేదా? అని అడుగుతూ గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్, నక్క అనూరాధ, జెడ్. పి వైస్. చైపర్సన్, పోసిన శ్రీ లేఖ, ఎ. యం. సీ. ఛైర్మెన్ వి. గంగధర శ్రీనివాస్, బండి పట్టాభి రామా రావు, కాకర్ల వెంకటేస్వర రావు, నక్కా చిట్టిబాబు, గూడ విజ యరాజు, పోసిన శ్రీ కృష్ణ దేవ రాయులు, యం. పి. డి. ఓ, యం.రాజశేఖర్, తాహిసీల్దార్, శర శాంతి, కొవ్వూరు నియో జకవర్గ నాయకులు, అధికా రులు తదితరులు పాల్గొ న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *