విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హనుమాన్ పేట నందలి వెహికల్ డిపో నందు చేపట్టి ఆధునీకరణ పనుల పురోగతిని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పరిశీలించి డిపో నందు చేపట్టిన నిర్మాణ పనులు అన్నియు సత్వరమే పూర్తి చేయునట్లుగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టి నిర్మాణ పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయునట్లుగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంలో డిపో ఆవరణలో గల ఖాళి స్థలము నందు వాహనముల పార్కింగ్ చేసుకొనేలా చదును చేయుట మరియు దానికి అడ్డంగా ఉన్న ట్రాన్స్ ఫార్మ్ అక్కడ నుండి మార్చుటకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ కె.కోటేశ్వరరావు మరియు స్టోర్స్ ఇన్ ఛార్జ్ యోగేంద్ర పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …