విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు నగరపాలక సంస్థ పరిధిలోని పలు బ్యాంక్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకములలో బ్యాంకుల ద్వారా అర్హులైన లబ్దిదారులకు అవసరమైన ఋణాలు కల్పించవలసిన అవసరం ఎంతో ఉందని, లబ్దిదారుల యొక్క జీవన విధానమును దృష్టిలో ఉంచుకొని సత్వరమే వారికీ ఋణాలు మంజూరు చేయునట్లుగా బ్యాంకర్స్ ముందుకు రావాలని అన్నారు. నేటి సమావేశంలో ప్రధానంగా టిడ్కో బుణాలు, పేదలందరికి ఇళ్ళు, జగనన్న తోడు, పి.యం స్వనిది అంశాలపై బ్యాంకర్లకు తగు సూచనలు చేసారు. టిడ్కో హౌసింగ్ ఋణాల అర్జీలను బ్యాంకులకు పంపించుట జరిగిందని, రాబోవు రెండు వారాలలో లబ్దిదారులకు ఋణాలు మంజూరు చేయునట్లుగా చూడాలని అన్నారు. స్వయం సహాయక సంఘాలలో ఉన్న ప్రతి మహిళకు హౌసింగ్ లోన్ మంజూరు కాబడిన వారందరికి ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు రూ.35,000/- ఋణo ఇవ్వవలసినదిగా కోరినారు. అదే విధంగా జగనన్న తోడు లో బ్యాంక్ ద్వారా ఋణ సౌకర్యం పొందుటకు ఎంపిక కాబడిన లబ్దిదారులకు రూ.10,000/- ఋణము జమ చేయాలని అన్నారు. దీనితో పాటుగా పి.యం స్వనిది 2వ విడతగా అర్హులైన లబ్దిదారులకు రూ.20,000/- మంజూరు చేయునట్లుగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ (జనరల్) మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి యం.శ్యామల, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా వివిధ బ్యాంక్ ప్రతినిధులు మరియు యు.సి.డి సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …