రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తూన్న ఇళ్ల నిర్మాణం కి సంబందించిన సిమెంట్, ఇసుక, ఐరెన్ కు లే అవుట్ లలో సిద్దం చేసుకోవడంపై క్షేత్ర స్థాయి అధికారులకు సూచించినట్లు జిల్లా కలెక్టర్ డా. కె .మాధవీలత పేర్కొన్నారు
శనివారం జిల్లా కలెక్టర్ లతో అమరావతి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.ఎస్.జవహర్ రెడ్డి, కార్యదర్శి సాల్మన్ ఆరోక్య రాజ్ లు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు కోసం క్షేత్ర స్థాయిలో నిర్దేశించి లక్ష్యాలను పూర్తి చెయ్యడం పై ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్, నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులతో క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. నవరత్నాలు పేద లందరికీ ఇళ్ల పథకం అమలు లో జగనన్న కాలనీలలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మెటీరియల్ లే అవుట్ లలో సిద్దం చేసేందుకు అవసరమైన సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇంటి నిర్మాణ పురోగతి విషయంలో స్టేజ్ కన్వర్షన్ కై హౌసింగ్, పిఆర్ తదితర ఇంజనీరింగ్ లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశామని మాధవీలత తెలిపారు. గ్రామ స్థాయి లోని కార్యదర్శులకు టార్గెట్ ఇవ్వడం ద్వారా ఓటిఎస్, హౌసింగ్ నిర్మాణం వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.
అంతకు ముందు, ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి జరుగుచున్న పనులపైన సచివాలయాలు, హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, తదితర భవన నిర్మాణాలపై సిఎం కార్యదర్శి సాల్మన్ ఆరోక్య రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణ బాబు, గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ కోన శశిధర్ లు సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో జరుతున్న ప్రభుత్వ భవన నిర్మాణాలు పూర్తి చేసేందు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ భవన నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ క్లినిక్స్, సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాలు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆయా శాఖలు పెండింగ్ బిల్లులు ఉంటే తక్షణమే వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణ బాబు మాట్లాడుతూ హెల్త్ క్లినిక్ ల నుండే ప్రజలకు అందుబాటులో టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకురావచ్చునని చెప్పారు. 104 వాహనాలను బలోపేతం చేస్తున్నామని, . హెల్త్ క్లినిక్ భవనాలకు టెండర్లు పిలిచి త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కోన శశిధర్ ప్రాధాన్యత భవనాలు నిర్మాణం, సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్ ఈ, ఏ బి వి ప్రసాద్ పాల్గొన్నారు.