రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సోమవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని ఇంఛార్జి జిల్లా పంచాయతీ అధికారి జే ఏ ఎస్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం బొమ్మూరు గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సచిన్ ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపద్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని విధి పంచాయతీల్లో నీటి నిలవ ఉండే ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుటుంన్నా మన్నారు. ఎక్కడికక్కడ చెత్త సేకరణ చేయడంతోపాటు ముగ్గులు మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా ఉండేలా శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులకు గ్రామ వార్డు సిబ్బందికి వాలంటీర్లకు శానిటేషన్ పరిస్థితులపై ప్రత్యేకతలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. లోతట్టు ప్రాంతాల లో నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని , సీజనల్ వ్యాధుల వ్యాప్తి నిరోధానికి పరిశుభ్రత కోసం ప్రజలను చైతన్యం చెయ్యవలసి ఉందన్నారు. ఇందుకోసం గ్రామ స్థాయి సిబ్బందితో కలిసి పనిచేస్తున్నామన్నారు.
Tags rajamendri
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …