విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా అందించే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), నీట్ (NEET) ప్రవేశ,పోటీ పరీక్షలకు హాజరయ్యే జిల్లాకు చెందిన ముస్లింలు, క్రిస్టియన్లు(BC -C), సిక్కులు, బౌద్ధ మైనారిటీ వర్గాలకు చెందిన పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఈ శిక్షణ ఇంగ్లీష్, తెలుగు మీడియం లలో ఉంటుందన్నారు. శిక్షణకు హాజరు కాదలచిన విద్యార్థులు తమ దరఖాస్తులను జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇతర వివరాలకు 0866-2970567 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రియాజ్ సుల్తానా ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …