Breaking News

గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరం…

-లింగనిర్థారణ వెల్లడించినట్లు రుజువైతే అటువంటి వారి పై చట్టప్రకారం 3సం.రాలు జైలు, రూ.10 వేలు జరిమానా..
-ప్రతి రెండు మాసాలకొకసారి డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది.
-ప్రతి మూడు మాసాలకు ఒకసారి డివిజన్ పరిధిలోని స్కానింగ్ సెంటర్లు కమిటీ తనిఖీ చేస్తుంది..
-ఆర్డీఓ చైతన్య వర్షిని

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇందుకు బిన్నంగా ఎవరైనా లింగనిర్థారణ పరీక్షలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని  ఆర్డీవో ఏ. చైతన్య వర్షిని అన్నారు.

స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం   ఆర్డీవో చైతన్య వర్షిని డిప్యూటీ డిఎంహెచ్ఓ డా.సుధాకర్ తో కలసి పీసీపీఎన్డీటి యాక్టు అమలుపై  వైద్యులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు.  ఈ సందర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ గర్భం ధరించడానికి ముందుగాని, గర్భం ధరించిన తర్వాత గాని పుట్టబోయే బిడ్డ లింగ నిర్థారణ చట్టరీత్యా నేరమమన్నారు. డివిజన్ పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో గల వైద్యులు గాని లేదా ల్యాబ్  నిర్వాహుకులు సాంకేతిక పరికరాలు ద్వారా లింగనిర్థారణ చేసినట్లు  వెల్లడైతే  పీసీ పీఎన్డీడీ చట్ట ప్రకారం  శిక్షార్హులన్నారు. ఈ చట్టం అమలు పై జిల్లా స్థాయిలో కమిటీతో పాటు డివిజన్ పరిధిలో కూడా ఆర్డీవో, డిఎస్పీ,డిప్యూటీ డీఎంహెచ్ ఆద్వర్యంలో కమిటీ ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తామన్నారు.  రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో ఉన్న స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు క్రమం తప్పకుండా నిర్ణీత కాల వ్యవధిలోపే రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు.

డివిజన్ స్థాయి కమిటీ
డివిజన్ పరిధిలో డయాగ్నోస్టిక్ సెంటర్ల ను, ప్రైవేట్ ఆస్పత్రులను ప్రతి మూడు నెలలకు ఒకసారి తనిఖీలు చేస్తూ డెకాయ్ పరీక్షలను నిర్వహిస్తారన్నారు. ఈ చట్టాన్ని మొదటి సారి ఉల్లంఘించిన వైద్యులు గాని,  నిపుణులు గాని లేదా ల్యాబ్ నిర్వాహుకులకు, ఇతరులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష తో పాటు రూ. 10 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని, తదుపరి కూడా  ఉల్లంఘనకు  పాల్పడినట్లు రుజువైతే  రూ.50 వేల రూపాయల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని ఆర్డీవో చైత్రవర్షిని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు గాని ల్యాబ్ నిర్వాహుకులు గాని లింగ నిర్ధారణ చేయు సామర్థ్యం గల ఏ యంత్రమైనా కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ చట్ట ప్రకారం సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వద్ద నుంచి  పర్మిషన్ తీసుకోవాలన్నారు. వైద్యులు గాని సాంకేతిక ల్యాబ్ లు గాని సంబంధిత గర్భిణీకి గాని, ఆమె బంధువులకు గాని పుట్టబోయే బిడ్డ లింగ వివరాలను వెల్లడించడం నేరంగా పరిగణించ బడుతుందన్నారు. సమాజంలో ఆడ, మగ  అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమతుల్యాన్ని పాటించాలని  ఈ సందర్భంగా ఆర్డీవో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాజమహేంద్రవరం డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్ ఓ డా. సుధాకర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో గర్భస్థ శిశు లింగ నిర్థారణ పరీక్షల చేయు డయాగ్నోస్టిక్ సెంటర్లు 117 ఉన్నాయన్నారు. ఎవరైనా గర్భస్తు లింగనిర్థారణ పరీక్షలకు చేసినట్లు వెల్లడైతే చట్టప్రకారం శిక్షార్హులన్నారు. దేశంలో ప్రతి వెయ్యింది బాలురకు 990 మంది బాలికలు మాత్రమే ఉన్నారన్నారు. డివిజన్ పరిదిలో ప్రతి రెండు మాసాలు ఒకసారి పీసీ పీఎన్డీటీ యాక్టు డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ ఓ డా. సుధాకర్ జిల్లా ఆసుపత్రి ఆర్.ఎం.ఓ డా. ఆనంద్, ఐసిడిఎస్ అధికారులు, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *