విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో క్యాంటిన్ నిర్వహణ వి.యం.సి మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారికి కేటాయించి గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో క్యాంటిన్ ను ప్రారంభించారు. ఈ సందర్బంలో అసోసియేషన్ ప్రతినిధులు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నగరపాలక సంస్థ సిబ్బంది మరియు వివిధ పనుల మీద కార్యాలయానికి వచ్చు ప్రజలకు గత కొంత కాలంగా నగరపాలక సంస్థ నందు క్యాంటిన్ సౌకర్యం లేకపోవుట సదరు విషయాన్ని మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు మేయర్ మరియు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే సానుకూలంగా స్పందిస్తూ, క్యాంటిన్ ఏర్పాటుకు వి.యం.సి మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారికీ అవకాశం కల్పించుట పట్ల ధన్యవాదములు తెలియజేసారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …