విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) మరియు సచివలయాల స్పెషల్ ఆఫీసర్ కె.వి సత్యవతి గురువారం సర్కిల్ -3 పరిధిలోని 2వ డివిజన్ పరిధిలోని కార్మిక నగర్, మాచవరం నందలి 24, 35 మరియు 6వ డివిజన్ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్ లోని 32, 33 మరియు 34వ వార్డ్ సచివాలయాలను సందర్శించారు. ఆయా సచివాలయాలలో విధులు నిర్వహించు సిబ్బంది యొక్క పనితీరు మరియు ప్రజలు అందించు సేవలు మరియు సమస్యల అర్జీలపై తీసుకొనుచున్న చర్యలపై సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇస్తూ, విధి నిర్వహణలో భాద్యతగా పని చేయాలని నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. అదే విధంగా జగనన్న గృహ లబ్దిదారుల విషయమై అడ్మిన్, ఎమినిటి సెక్రెటరీ, వెల్ఫేర్ సెక్రెటరీలు చేపట్టిన చర్యలను అడిగితెలుసుకొని, లే అవుట్ లలోని లబ్దిదారులు వెంటనే గృహ నిర్మాణం చేపట్టు విధంగా అవగాహన కల్పించి లబ్దిదారులు గృహములు నిర్మించుకోనునట్లు చూడవలెనని తెలియజేశారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …