-48 వ డివిజన్ పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్,సోరంగం వైపు వెళ్లే దారిలో 48వ డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ మరియు నగర కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 48వ డివిజన్ కార్యాలయాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ భారీగా హాజరైన పార్టీ నాయకులు కార్యకర్తలు 48 వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. జెండా వందనం చేసిన అనంతరం, నూతన డివిజన్ కమిటీ ప్రమాణ స్వీకారం మరియు డివిజన్లో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన వారికి కిట్లను ముఖ్యఅతిథిగా హాజరైన పోతిన వెంకట మహేష్ చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు గారు వ్యవహరించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో 48 వ డివిజన్ లో బలమైన క్యాడర్ వలన ఓటు బ్యాంకు కూడా బలంగా ఉందని రాబోయే రోజుల్లో డివిజన్లో ఐదు వేల ఓట్లు సాధించాలని, ఇక్కడి నుంచే గాజు గ్లాస్ గుర్తు పై పోతిన వెంకట మహేష్ గెలుపుకు విజయఢంకా మోగించాలని, పశ్చిమ నియోజకవర్గం లో కేవలం జనసేన పార్టీ మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని మూడు సంవత్సరాల నుంచి వైసిపి అన్యాయాలు అరాచకాలు అవినీతిపై నిరంతరం పోరాడుతూన్నాం అంటె అది కేవలం జనసైనికులు నిరంతరం అండగా నిలబడి ప్రతి పోరాటంలో ముందుండి నిలబటం వల్ల ఇది సాధ్యం అవుతుందని, ఎమ్మెల్యేగా ఉండి 2014లో వెలంపల్లి శ్రీనివాస్ ఒక్క సీటు కూడా గెలిపించ లేకపోయారని, 2014 నుంచి. 2018 వరకు బిజెపిలో కొనసాగిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని 2019 ఎన్నికల్లో గెలిచాక కేవలం వ్యక్తిగత అభివృద్ధిని మాత్రమే సాధించి నియోజకవర్గంలో కొండ ప్రాంత సమస్యలను రోడ్ల నిర్మాణాన్ని పూర్తి పూర్తిగా గాలికి వదిలేశారని అందుకే గడపగడపకు కార్యక్రమంలో పశ్చిమాన ప్రజలు నిలదీస్తున్నారని ,సమాధానం చెప్పలేక ప్రజలపై దుర్భాషలాడుతూ, బెదిరింపులకు దిగుతూ పోలీసు వారితో కేసులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని,కానీ ప్రజలు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన పార్టీ వైపే చూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు పై నేను గెలవడం పక్కా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలిశెట్టి ఉమమహేశ్వరరావు ,తమ్మిన రఘు ,మరూపిళ్ళ సింహాచలం ,దిండి నాని ,దాసిన జగదీష్, పవన్ కళ్యాణ్ , పి దుర్గా రావు ,యస్ శ్రీను పైల నాగరాజు తదితరులు పాల్గొన్నారు