రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పోర్ట్స్ కోటాలో వైద్య & ఆరోగ్య శాఖ లో ఎంపికైన పోస్టుల భర్తీకి తాత్కాలిక ఎంపిక జాబితాను వెబ్ సైట్ లో ఉంచడం జరిగిందని జిల్లా క్రీడ ప్రాధికారా సంస్థ, రాజమహేంద్రవరం చీఫ్ కోచ్ డి. ఏం ఏం. శేషగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్ ఎన్ ఓ /ఫార్మా సిస్టు, జనరల్ డ్యూటీ అటెండెంట్/ లాబ్ టెక్నిషియన్స్ పోస్టుల భర్తీకి స్పోర్ట్స్ కోటా లో ఎంపికైన అభ్యర్థుల తాత్కాలిక జాబితా పై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న మెయిల్ ద్వారా పంపవచ్చు నని తెలియ చేశారు. ఈ జాబితా ప్రకారం ఎంపికైన అభ్యర్థులు వివరాలు (తాత్కాలిక జాబితా) http:// sports.so.gov.in/#/ వెబ్సైట్ లో ఉంచడం జరిగిందన్నారు. ఈ జాబితా పై ఏమైన అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చెయ్య వచ్చునని సాప్ విసి అండ్ ఎండి డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపినట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం ఈ మెయిల్స్ .. vcmdsaap@gmail.com లేదా vcmd -saap@ap.gov.in కు ఫిర్యాదులు పంపవచ్చునని తెలిపారు.
Tags rajamendri
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …