రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) పధకం క్రింద ఆర్.బి.కె.లకు అనుబంధంగా మల్టిపర్పస్ ఫెసిలీటీ సెంటర్లు (గొడౌన్లు..) నిర్మాణం కోసం జిల్లాలో తొలి ఫేజ్ లో 46 గోడౌన్ లకు గాను 24 చోట్ల పనులు ప్రారంభించామని, రెండో దశలో 59 కి గాను 10 చోట్ల స్థలాలు గుర్తించామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.
గురువారం మల్టీపర్పస్ గోడౌన్లు, జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా నిర్మించనున్న ఏ.ఎమ్.సి సి, బి. ఎమ్.సి.సి. లపై మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి.ఎస్.ప్రద్యుమ్న, ఎపి డెయిరీ డేవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీ అహ్మద్ బాబు తదితరులు అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్ కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ డా. కె.మాధవిలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ , జిల్లాలో 162 బల్క్ మిల్క్ యూనిట్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 162 బల్క్ మిల్క్ యూనిట్స్ 114 చోట్ల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఇంకా 25 చోట్ల స్థలాలు గుర్తించాల్సి ఉందన్నారు.
మల్టీపర్పస్ గోడౌన్లు ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఉద్యోగ అవకాశాలను కల్పించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. పధకం, పంట అనంతర నిర్వహణ కోసం ఆచరణీయ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి మధ్యస్థ-దీర్ఘకాలిక ఆర్ధిక రుణ సదుపాయాన్ని అందిస్తుందని తెలిపారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) పధకం క్రింద జిల్లాలో కొవ్వూరు, రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో రెండవ విడత చేపట్టనున్న 59 మల్టిపర్పస్ ఫెసిలీటీ సెంటర్లు (గొడౌన్లు) నిర్మాణాలకు 10 కేంద్రాలకు స్థలాలు గుర్తించామన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో లాండ్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాసరావు, సిబ్బంది పరిమళ, డి సి వో స్టాఫ్ వై. అపర్ణ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.