విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని గర్భవతులు బాలింతలకు జూలై 1వ తేది నుండి వేడి వేడి ఆహరం అందించనున్నట్లు శిశు సంక్షమ శాఖ జిల్లా పాజెక్ట డైరెక్టర్ జి. ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎనిమిది ఐసిడియస్ ప్రాజెక్టల పరిధిలో గల1475 అంగన్‌వాడి కేంద్రాలలో గర్భవతులు బాలింతలకు కోలిడ్ కారణముగా గత రెండు సంవత్సరాలు నుండి ఇప్పటి వరకు ఇంటి వద్దకే ఆహర పదార్థాల పంపిణీ చేస్తున్నాట్లు తెలిపారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు జూలై 1 వ తేది నుండి అంగన్ వాడీ కేంద్రాలలోనే వేడి వేడి ఆహరన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగందన్నారు. తల్లిబడ్డలకు మంచి పోషికాహరం అందించి ఆరోగ్యవంతంగా ఉంచేందుకు అందిస్తున్న వేడి వేడి ఆహరాన్ని గర్భవతులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ అధికారి ఉమాదేవి కోరారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …