విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడ ఒకటి. రోజూ వందల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. పండుగలు, పర్వదినాల్లో భక్తుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుమల తరహాలోనే ఇంద్రకీలాద్రిని కూడా ‘‘టొబాకో ఫ్రీ జోన్’’గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన డిక్లరేషన్‌పై కలెక్టర్ ఢిల్లీ రావు, ఆలయ ఈవో, డీఎంహెచ్‌వో సంతకాలు చేశారు. భక్తులు, ఆలయ సిబ్బంది కచ్చితంగా ఈ నిబంధన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘టొబాకో నియంత్రణలో భాగంగా సిగరెట్, ఇతర టొబాకో ఉత్పత్తులను దుర్గగుడిలో పూర్తిగా నిషేధిస్తున్నాం. తిరుమలలో అమలవుతోన్న కోట్పా యాక్ట్‌ను దుర్గమ్మ గుడిలోనూ అమలు చేయాలని నిర్ణయించాం. నేటి నుంచి దుర్గగుడి పరిసర ప్రాంతాలు టొబాకో ఫ్రీ జోన్‌గా ప్రకటించాం. ఉద్యోగులు, భక్తులు ఎవరైనా టొబాకో కాని మరే ఇతర ప్రాడక్ట్స్ వాడకూడదు. ఈ నిబంధన తప్పకుండా పాటించాలి. దుర్గగుడి అధికారులు, ఆరోగ్యశాఖ అధికారుల నిరంతరం నిఘా ఉంటుంది. నిబంధన ఉల్లంఘించిన వారికి రూ. 200 ఫైన్ వేస్తాం.’’ అని కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిని “పొగాకు నిషేధిత ప్రాంతం గా ప్రకటించు సందర్భంగా జరుగు సమావేశానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు బ్రాహ్మణ వీధిలోని జమ్మిదోడ్డి కార్యాలయం వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ స్వాగతం పలికారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం2003 అమలు చేయడంలో భాగంగా దేవస్థానం ప్రాంగణంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టరు ఏస్.డిల్లీరావు ఆలయ ప్రాంగణంలో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం-కోప్టా2003 అమలును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టం అమలు ఆలయ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, తదితరులు అంకితభావంతో పని చేసి సమర్థవంతంగా చట్టాన్ని అమలు చేయాలని, అదే విధంగా మీడియా సహకారంతో ఈ చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా సమర్థవంతంగా అమలు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుహాసిని, టోబాకో స్టేట్ నోడల్ అధికారి డా.ఈవూరి ప్రశాంత్, అడిషనల్ డి.యం.హెచ్.ఓ ఉషారాణి , జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ ఇందుమతి, ఆర్.బి.ఏస్.కె నోడల్ అధికారి డా.మాధవి, జిల్లా టొబాకో కంట్రోల్ కో-ఆర్డినేటర్లు హరీష్, ఆలయ పారిశుద్ధ్య, సెక్యూరిటీ, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …