విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ భవన నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని నిర్ధేశించిన కాలానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఉపాధి హామి పథకంలో చేపడుతున్న గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు తదితర ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల ప్రసుత ప్రగతి, నిర్మాణాలకు అవసరమైన సిమ్మెంట్ సరఫరా వంటి పలు అంశాలపై శనివారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి, ప్రన్సిపల్ సెక్రటరి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్భన్ డెవలప్‌మెంట్ కమిషనర్ కోన శశిధర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు. జాతీయ ఉపాధిహామి పథకంలో చేపట్టిన జిల్లాకు మంజూరైన 268 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలలో భాగంగా ఇప్పటికే 130 భవనాలు పూర్తి అయ్యాయని, మరో 42 భవనాలు బిలో బెస్‌మెంట్ స్థాయిలో ఉన్నాయని, వీటితో పాటు వివిధ దశలో ఉన్న వాటిని, వేగవంతం చేయడంతో పాటు ఇంకనూ ప్రారంభం కాని వాటిని త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు మంజూరైన 260 రైతు భరోసా కేంద్రాలలో 68కు పైగా భవననిర్మాణాలు పూర్తి అయ్యాయని మిగిలిన వివిధ స్థాయిలో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు మంజూరైన 239 వైఎస్సార్ క్లినిక్‌లలో 38 పూర్తి అయ్యాయని మిగిలినవి, వివిధ స్థాయిలో ఉన్న క్లినిక్‌ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. నిర్మాణాలకు అవసరమైన సిమ్మెంట్‌ను సరఫరా చేస్తున్న కంపెనీలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు స్పెషల్ సిఎస్‌కు వివరించారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …