మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లలను బడికి రప్పించడం,వారు చక్కగా చదువుకునేలా మంచి సౌకర్యాలను, వాతావరణాన్ని కల్పించడం ఒక వైపు చేస్తుంటే… మరోవైపు నాణ్యమైన విద్యను అందించడంపైన కూడావైయస్.జగన్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గట్టిచర్యలు తీసుకుంది. సోమవారం శ్రీకాకుళం వేదికగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి మొత్తం రూ.6595 కోట్లను జమ చేయడంతో పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లాలో 1 లక్షా 34 వేల మంది విద్యార్థిని విద్యార్థులకు సోమవారం ఉదయం వేసవి సెలవులు 202 కోట్ల 35 లక్షల 35 వేల రూపాయలను ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం జడ్పి కన్వెన్షన్ హాల్ లో జరిగిన అమ్మఒడి అధికారిక కార్యక్రమంలో పలువురు విదార్థిని విద్యార్థులు సంతోషంగా తమ తల్లితండ్రులతో పాల్గొన్నారు.
మచిలీపట్నంకు చెందిన విద్యార్థిని ఎస్. జయసింధు :
నాలుగేళ్ల క్రితం ప్రతి విద్యా సంవత్సరం మొదలయ్యేసరికి తమ తల్లితండ్రులు తమకు స్కూల్ ఫీజులు, పాఠ్య పుస్తకాలు,నోటు పుస్తకాలు యూనిఫార్మ్స్ , బూట్లు కొనాలంటే ఎంతో ఇబ్బందులు పడేవారని అప్పట్లో ప్రవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు డబ్బు చెల్లిస్తేనే చదువులు అని తరగతి గదుల్లో చెప్పేవారని తమ తల్లితండ్రులు ఆ మొత్తాన్ని కట్టలేక నానా అవస్థలు చెందేవారని జయసింధు పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ మామయ్య తమ ఉన్నతమైన భవిష్యత్ కోసం ఎంతో శ్రమిస్తున్నారని తెలిపింది. నాడు -నేడు ద్వారా పాఠశాలలో అన్ని వసతులు సమకూర్చడమే కాక మధ్యాహ్న భోజన పథకంలో సంపూర్ణ పౌష్ఠిక ఆహరం ఇస్తూ, ఆంగ్లంలో విద్యాబోధన అవకాశం ఇచ్చారన్నారు.
మచిలీపట్నంకు చెందిన మరో విద్యార్థిని ఐ. నిఖిల :
పేదరికంగా కారణంగా గతంలో ఎందరో మధ్యలోనే బడి మానివేసి బాల కార్మికులుగా మారిపోయారని తమతో పాటే చదివిన ఎందరో అలా మారిపోయారన్నారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు చదువుకొనే అవకాశం ఇచ్చారని అమ్మఒడి పథకం ఒక వరం లాంటిదని నిఖిల చెప్పింది. పేద ధనిక తారతమ్యం లేకుండా తాము ఇష్టపడిన ప్రభుత్వ పాఠశాలలో కస్టపడి చదువుకొంటున్నామని తమ తల్లితండ్రులు కోరిక మేరకు ఎంతో ఉన్నత స్థానానికి తప్పక చేరుకొంటామనే ఆత్మవిశ్వాసం ఇప్పుడు తమకు ఉందని ఆ బాలిక చెప్పింది.