విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదురుగా కాలువ వెంబడి చేపటిన గ్రీనరి, అభివృద్ధి పనులు కమిషనర్ పరిశీలించారు. కెనాల్ వ్యూ పార్క్ లో రోడ్డు వైపు గ్రీనరిని పెంచాలని, నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చే సందర్శకులకు ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలతో తీర్చిదిద్దాలని అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు వున్న కెనాల్ బండ్ నందు పెరిగిన చెట్లను ట్రిమ్మింగ్ చేయాలని, కెనాల్ బండ్ లో రైలింగ్ అక్కడక్కడ లేదు లేని చోట రైలింగ్ ఏర్పాటు చేయాలని, కెనాల్ బండ్ లో మెట్ల నుండి లోపలికి దిగిన తరువాత ఎడమవైపు వున్న ఖాళీ స్థలంలో బొమ్మ ను ఏర్పాటు చేయాలని అదేశించారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …