-మౌలిక సదుపాయాలలో ఎదుర్కోను ఇబ్బందులపై దృష్టి సారించాలి.
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పందనలో ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నేటి స్పందనలో మొత్తం 26 అర్జీలు సమర్పించగా వాటిలో ఎస్టేట్ విభాగం – 1, ఇంజనీరింగ్ విభాగం – 5, పట్టణ ప్రణాళిక విభాగం – 14, రెవెన్యూ – 3, యు.సి.డి (పి.ఓ) – 2, వార్డ్ సచివాలయం – 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 3 అర్జీలు.
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 2 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1, యు.సి.డి (పి.ఓ) – 1 అర్జీలు, సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1 అర్జీ మరియు సర్కిల్ – 1 కార్యాలయంలో ప్రజలు ఎటువంటి ఆర్జీలు అందించుట జరగలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.