విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవతా దృక్పథంతో పేద విద్యార్థులను ఆదరించే దాతలు సమాజ శ్రేయోభిలాషులు గా గుర్తింపబడతారని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు. నగరంలో పేద అనాధ విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందించే విధంగా మొదటి విడతగా 10 వేల పుస్తకాలను అందించేందుకు విద్యా దాత ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర తమ్మిన కార్యాచరణ చేపట్టి ఆ పుస్తకాలను సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ సమాజంలో పేద విద్యార్థులను ఆదరించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సమాజంలో మానవతా దృక్పథం కలిగిన దాతలు ముందుకు రావాలన్నారు, విద్యా దాత పౌండేషన్ ను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యాదాత ఫౌండేషన్ కమిటీ సభ్యులు వి భాస్కర్, బి మోహనచంద్ర ఉన్నారు. విద్యా దాత ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర తమ్మిన మాట్లాడుతూ మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యిందని. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జన్మదినం ఆగస్టు 2వ తేదీ కావడంతో పింగళి వెంకయ్య చిత్రాన్ని పుస్తకంపై ముద్రించడం జరిగింది అన్నారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …