-తెలుగుజాతి రత్నం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుజాతి రత్నం మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని మంగళవారం రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో నిర్వహించిన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపిసిసి లీగల్ చైర్మన్ వళిబొయిన గురునాధం, ఏపిసిసి కార్యదర్శి అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జి నూతలపాటి రవికాంత్, నగర అధ్యక్షుడు నరసింహారావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురునాధం మాట్లాడుతూ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెంక్కించిన చాణుక్యుడు పీవీ అని అన్నారు. దేశ రాజకీయాల్లో తెలుగు వారి పేరు ప్రతిష్టలు ఇనుమడింపచేశారని పేర్కొన్నారు. పివి బహుభాషా ప్రావీణ్యుడని కొనియాడారు.