Breaking News

ప్రజల చెంతకు పాలన ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-59వ డివిజన్ 235 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
-జోరువానలోనూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలకు మెరుగైన సౌకర్యాలతో పాటు ప్రజల చెంతకు పాలన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సోమవారం 59 వ డివిజన్ – 235 వ వార్డు సచివాలయం పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా, పార్టీ శ్రేణులతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రామ్ నగర్ లో విస్తృతంగా పర్యటించి.. సుమారు 512 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల తీరును తెలుసుకునే కొత్త ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అవసరమైన చోట సైడ్ కాల్వలను నిర్మించాలన్నారు. అలాగే కాలనీవాసులు కూడా అసోసియేషన్లుగా ఏర్పడవలసిన అవసరం ఉందని మల్లాది విష్ణు అన్నారు. దీని ద్వారా అపార్ట్మెంట్ల నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. చిన్న చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రధాన సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే.. రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ సహకారంతో మౌలిక సదుపాయాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే నూతన బ్లాక్ లలో కొత్త వాలంటీర్లను త్వరలోనే నియమించి.. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలియజేశారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ఈ ప్రాంతంలో కొత్త సచివాలయ ఏర్పాటు దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల పనితీరు అమోఘమని ఎమ్మెల్యే మ్లలాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాలలో వాలంటీర్ల వ్యవస్థను కలుపుకుని దశ రత్నాలుగా ఆయన అభివర్ణించారు. నవరత్నాల పథకాలను ప్రజలు ఏవిధంగా స్వాగిస్తున్నారో.. అదే విధంగా వాలంటీర్లను కూడా ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలపై వారాంతానికి యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు.

235వ వార్డు సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 3.12 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 300 మందికి ప్రతినెలా రూ. 7.73 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 472 మందికి రూ. 70.80 లక్షలు., విద్యాదీవెన ద్వారా 38 మందికి రూ. 3.86 లక్షలు., కాపునేస్తం ద్వారా 17 మందికి రూ. 2.55 లక్షలు., జగనన్న తోడు ద్వారా 34 మందికి రూ.3.40 లక్షలు., చేయూత ద్వారా 144 మందికి రూ. 27 లక్షలు., వాహనమిత్ర ద్వారా 38 మందికి రూ. 3.80 లక్షలు., చేదోడు ద్వారా రూ. 10 వేల చొప్పున 13 మంది రూ. 1.30 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్య కోసం ఖర్చు చేస్తున్న ప్రతీ రూపాయి రాష్ట్రానికి, దేశానికి పెట్టుబడి అనే ఆలోచనతో అమ్మఒడి కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని మల్లాది విష్ణు అన్నారు. అటువంటి బృహత్తర కార్యక్రమంపై కొన్ని రోజులుగా దుష్ప్రచారాలు చేస్తున్న వారంతా ప్రజాక్షేత్రంలో అభాసుపాలయ్యారని పేర్కొన్నారు. ఈ ఏడాది అమ్మఒడి ద్వారా 82.31 లక్షల మంది విద్యార్థులకు రూ. 6,595 కోట్లు లబ్ది చేకూర్చినట్లు వివరించారు. కనుక విద్యా రంగంపై చేస్తున్న నీచ రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. అమరావతిలో పెద్దఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడిన చంద్రబాబు, పచ్చ నేతలకు.. అక్కడి భూముల గూర్చి మాట్లాడే నైతిక అర్హత లేదని మల్లాది విష్ణు అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని.. వేల ఎకరాలు విదేశీ కంపెనీలకు దోచిపెట్టింది మర్చిపోయారా..? అని ప్రశ్నించారు. ఒక్క సింగపూర్ కన్సార్టియంకు 1,600 ఎకరాలు ధారాదత్తం చేసి అమరావతిని పూర్తిగా అవినీతికి కేంద్రంగా మార్చారన్నారు. 4,070 ఎకరాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ తో.. అమరావతిని చంద్రబాబు పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కానీ ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం ఈఆక్షన్ ద్వారా ముందుకు వెళుతోందని.. దీనిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికలోనూ కనీసం ఖాతా కూడా తెరవని బీజేపీ.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని సోమువీర్రాజు మాట్లాడటం హాస్యాస్పదమని మల్లాది విష్ణు అన్నారు. ఆయన మాటలు విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్ సీపీ ఓట్ల శాతం పెరుగుతోందని మల్లాది విష్ణు అన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలతో మరొకసారి అది రుజువైందని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు హఫీజుల్లా, భోగాది మురళి, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నందెపు సురేష్, నేరెళ్ల శివ, షేక్ అమిత్, గల్లెపోగు రాజు, కొండలరావు, తమ్మిశెట్టి రాజు, చింతా శ్రీను, షేక్ జమీర్ భాష, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *