Breaking News

ఎస్సీ, ఎస్టీ కేసులను సత్వరమే పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించండి…

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులపై ఖచ్చితమైన దర్యాప్తు నిర్వహించి చార్జిషీట్‌ దాఖలు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం అమలుపై (ఎస్సీ, ఎస్టీ పిసిఆర్‌, పిఓఏ, యాక్ట్‌) జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటి సమావేశాన్ని మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీస్‌, రెవెన్యూ, సాంఫీుక సంక్షేమం, ప్రాసిక్యూషన్‌ ప్రధాన విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎస్సీ, ఎస్టీ వర్గాలపై నమోదు అయిన కేసుల్లో జాప్యాన్ని నివారించి సత్వర న్యాయం అందించాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసులకు సంబంధించి 239 కేసులు పెండిరగ్‌లో ఉండగా మరో 66 కేసులు దర్యాపు స్థాయిలో ఉన్నాయన్నారు. వీటిలో వెస్ట్‌ ఎసిపి పరిధిలో 17, నార్త్‌ ఎసిపి పరిధిలో 9, సౌత్‌ ఎసిపి పరిధిలో 7, సెంట్రల్‌ ఎసిపి పరిధిలో 5 నందిగామ ఎసిపి పరిధిలో 15 తిరువూరు ఎసిపి పరిధిలో 8, దిశ పోలీసు స్టేషన్‌ పరిధిలో 4, సైబర్‌ క్రైమ్‌లో ఒక కేసు విచారణ దశలో ఉన్నాయన్నారు. ఆయా కేసులకు సంబంధించి పోలీస్‌ అధికారులు దర్యాపును పూర్తి చేసి చార్జి షీట్లను దాఖలు చేసి బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానాల పరిధిలో పెండిరగ్‌లో ఉన్న కేసులకు అవసరమైన పూర్తి సమాచారం అందించి త్వరితగతిన కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. కేసుల పరిష్కారానికి బాధితులకు కుల దృవీకరణ పత్రాల మంజూరులో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటామని, వారం రోజులలోగా దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని తహాశీల్థార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో కుల వివక్షతకు తావు లేదని అయితే పట్టణాలలో జీవనం సాగిస్తున్న మాధిరిగానే గ్రామీణ ప్రాంతాలలో కూడా అన్ని కులాలకు సంబంధించిన వారు సమిష్టి జీవనం సాగించేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇకపై గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాలను ఎస్సీ ఎస్టీ వర్గాల నివాసిత ప్రాంతాలలో తప్పనిసరిగా నిర్వహించిన్నట్లుతే ఆయా వర్గాలకు ఎదురయ్యే సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగలుగుతారని తద్వారా అధికారులు ఆ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్‌ అన్నారు.ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపించేలా ప్రొత్సహిస్తున్నామని తద్వారా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి జీవన విధానంలో మరింత మార్పు తీసుకువచ్చి ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన కేసుల విచారణలో జాప్యం లేకుండా సత్వర పరిష్కారానికి శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. అత్యాచారాలకు గురి అయిన ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర ఉపశమనం పునరావాసం కింద జిల్లాలో 196 మందికి 1కోటి 64 లక్షల 05 వేల 392 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మంజూరైన ఆర్థిక సహయాన్ని బాధితులకు అందించే భాధ్యతను రెవెన్యూ డివిజనల్‌ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌ కుమార్‌, నందిగామ తిరువూరు ఆర్‌డివోలు ఏ.రవీంద్రరావు, వై.వి. ప్రసన్న లక్ష్మి, డిసిపిలు డి మేరి ప్రశాంతి, యం వెంకటరత్నం, సోషల్‌ వెల్ఫర్‌ డిప్యూటి డైరెక్టర్‌ విజయభారతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రుక్మాంగదయ్య, ఎసిపిలు కె. వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు కె. హనుమంతురావు, బి రవికిరణ్‌, జివి రమణమూర్తి, షేక్‌ ఖాదర్‌బాషా, బి వి.సుబ్బరావు, వివినాయుడు, కెవివిఎన్‌వి ప్రసాద్‌, పి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *