Breaking News

అబివృద్ది పనులకు శంకుస్థాపన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ కృష్ణవేణి రోడ్ ప్రాంతాలలో వాటర్ పైప్ లైన్ మరియు పేవేర్ బ్లాక్స్ నిర్మాణ పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్,స్టాండింగ్ కమిటీ మెంబెర్ చింతల సాంబయ్య అధ్వర్యంలో దాదాపు 46 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో జరగబోయే శంకుస్థాపన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం,అబివృద్ది కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో దేవినేని నెహ్రూ ఉన్నప్పుడు ఈ డివిజన్లలో అబివృది కార్యక్రమాలు చేసాం. ఆ తరువాత వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అబివృద్ది పనులు జరుగుతున్నాయి. కార్పొరేటర్ ఎన్నికల్లో ప్రజలు కి ఇచ్చిన హామీ లో భాగంగా వాటర్ పైప్ లైన్ ,పెవర్ వర్క్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే పేద ప్రజలకి పథకాలు ఇచ్చి పడుచేస్తున్నారు అని మాట్లాడటం చాలా సిగ్గు సేటు. రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటి ఇంటికి వెళ్తుంటే ప్రజలు ఎంతో ఆనందంగా మాకు పథకాలు వస్తున్నాయి అని చెప్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు పసుపు కుంకుమ అని పేద ప్రజలను మోసం చేశారు. గత ప్రభుత్వాలు చెయ్యని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం Sc,St,Bc ఎన్నో కులాలకు సామాజిక న్యాయం చేసి ఎన్నో నామిటెడ్ పోస్టులు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వం. రాష్ట్రంలో అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో,ప్రాంతానికో పరిమితము కాకుండా అభివృద్ధి ఫలాలు అందరికి అందాలనే సంయున్నత లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన. గత ప్రభుత్వ టీడీపీ వాళ్ళ లాగా శంకుస్థాపన లు చేసి పనులు వదిలేయకుండా అవి పూర్తి అయ్యేవరకు నిత్య పర్యవేక్షణ చేస్తున్నాం. టీడీపీ నాయకులు కేవలం ప్రచార ఆర్భాటాలకు పరిమితం అని ఎద్దేవా చేశారు. గద్దె రామ్మోహన్ రోజు పేపర్ లో పడాలని ప్రజలలో అబద్దపు ప్రచారాలు చేసి, మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. గత ప్రభుత్వం హయాంలో తెలుగుదేశ పార్టీ ఓడిపోయిన డివిజన్ల ని పట్టించుకునే వారు కాదు.కానీ వైస్సార్సీపీ ప్రభుత్వం లో ఓడిపోయిన డివిజన్ల లలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అబివృద్ది పనులు చేస్తున్నాం. గత తెలుగుదేశ పార్టీ ప్రభుత్వం ఐదు ఏళ్లలో అబద్దలాతో,మోసపూరిత మాటలు చెప్పి పబ్బం గడిపారు. ప్రతి నెల ఒకటో తారికు రాగానే అవ్వ,తాతలకు ఇంటి దగ్గరకు వెళ్లి పెన్షన్స్ అందించే ఘనత వైస్సార్సీపీ ప్రభుత్వానిదే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసిన రానున్న 30 ఏళ్ళు ముఖ్యమంత్రి గా ఉంటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,మాజీ కార్పొరేటర్లు సుబ్బరాజు,రమాయణపు శ్రీనివాస్,డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గాప్రసాద్,వైస్సార్సీపీ నాయకులు చిమాటా బుజ్జి,గోవర్ధనరావు,ఉకోటి రమేష్,శివన్నారాయన, చిన్నయ్య,సాంబశివరావు, మల్లి,ఉమ,శ్రీనివాసరావు, కృష్ణామెను, రంగారావు మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *