-డబుల్స్ విభాగంలో విన్నర్స్‌గా సాయికుమార్ తంగెళ్లమూడి, విద్యాసాగర్ పావులూరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టెన్‌పిన్ బౌలింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని యువత సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమాస్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నమెంట్ ఆర్గనైజర్ సాయికుమార్ తంగెళ్లమూడి అన్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని లైఫ్‌స్టైల్ బిల్డింగ్‌లోని శ్మాష్ జోన్‌లో ఈ నెల 28 నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి బీమాస్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నమెంట్-5 గురువారంతో ముగిసింది. టోర్నమెంట్ నిర్వహణకు భీమాస్ ఫిట్నెస్ జిమ్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ సందర్భంగా భీమాస్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నమెంట్ నిర్వాహకులు సాయికుమార్ తంగెళ్లమూడి మాట్లాడుతూ.. ప్రతి నెలా జాతీయ స్థాయిలో జరిగే టోర్నమెంట్‌లో భాగంగా జూన్ మాసంలో సింగిల్స్, డబుల్స్‌లో జరిగిన పోటీల్లో 35 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. సింగిల్స్ క్యాటగిరిలో విన్నర్‌గా సాయికుమార్ తంగెళ్లమూడి, రన్నర్‌గా గౌతం అభిలాష్, సెకండ్ రన్నర్‌గా అబ్ధుల్ ముజీబ్ నిలిచారని పేర్కొన్నారు. అదేవిధంగా డబుల్స్ కేటగిరిలో విన్నర్లుగా సాయికుమార్ తంగెళ్లమూడి, పావులూరి విద్యాసాగర్ నిలిచారని పేర్కొన్నారు. రన్నర్స్‌గా రవి గుప్తా, బాలకార్తీక్ నిలవగా వీరిలో సెకండ్ రన్నర్స్‌గా గౌతం అభిలాష్, నిఖిల్ మైలవరపు నిలిచారని తెలిపారు. సింగిల్ గేమ్‌లో అత్యధిక స్కోర్ రహీం బేగ్ 265 సాధించగా, సాయికుమార్ తంగెళ్లమూడి 256 స్కోర్ సాధించినట్లు చెప్పారు. ప్రతి నెలా నిర్వహించే స్టేట్ ర్యాంకింగ్స్‌లో గెలుపొందిన వారు బీమాస్ జిమ్ ద్వారా జాతీయ స్థాయిలో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో జరిగే టోర్నమెంట్‌లో తెలుగువారి సత్తా చాటవచ్చని చెప్పారు. టెన్‌పిన్ బౌలింగ్ టోర్నమెంట్‌లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు ప్రతి నెలా జరిగే టోర్నమెంట్‌లో పాల్గొనాలని కోరారు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ప్రతీ వారం ప్రాక్టీస్‌లో పాల్గొనే సీనియర్ ప్లేయర్స్‌తో గేమ్‌లో పాల్గొనడం ద్వారా మంచి క్రీడాకారులుగా తయారు కావచ్చన్నారు. టోర్నమెంట్ నిర్వహణ, క్రీడాకారుల శిక్షణకు స్పాన్స్‌ర్‌గా శ్మాష్ జోన్ మేనేజ్‌మెంట్ అందిస్తున్న సహకారానికి ఈ సందర్భంగా సాయికుమార్ తంగెళ్లమూడి కృతజ్ఞతలు తెలిపారు.