Breaking News

మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-01వ డివిజన్ 002 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం 01 వ డివిజన్ – 002 వ వార్డు సచివాలయం పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఊర్మిళా నగర్లో విస్తృతంగా పర్యటించి ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 455 గడపలను సందర్శించి గ్రీవెన్స్ స్వీకరించారు. ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ఇంకా ఏవైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. మూడేళ్లలో అందించిన సంక్షేమాన్ని ఈ కార్యక్రమం ద్వారా పుస్తక రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాల మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైఎస్‌ జగన్‌ పాలనలో తామంతా సంతోషంగా ఉన్నట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఎమ్మెల్యేకు వివరించారు. గత ప్రభుత్వంలో ఎన్నో బాధలు చవి చూసామని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 వ వార్డు సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 3.50 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. డివిజన్ లో 217 పొదుపు సంఘాలకు ఆసరా ద్వారా రూ. 3.25 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. సున్నావడ్డీ ద్వారా 284 గ్రూపులకు మరో రూ. 47.70 లక్షలు అందజేశామన్నారు. అలాగే అమ్మఒడి ద్వారా సచివాలయ పరిధిలో ఈ ఏడాది 220 మంది తల్లుల ఖాతాలలో రూ. 33 లక్షల నగదు జమ చేసినట్లు తెలిపారు. పథకం వర్తించని అర్హులైన ఎవరైనా మిగిలి ఉంటే ఈనెల 15 వరకు వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఊర్మిళానగర్, షిర్టీ సాయి నగర్, ప్రశాంతినగర్, బుడమేరు కట్ట, హనుమాన్ నగర్ లలో నూతన రోడ్ల నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 3.57 కోట్లు వెచ్చించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. టీచర్స్ కాలనీ, ఆదర్శ్ నగర్, ప్రశాంతి నగర్ లలో రోడ్ల నిర్మాణానికి మరో రూ. 82.11 లక్షలు మంజూరయ్యాయని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. నాడు-నేడు ద్వారా చేసిన అభివృద్ధి ప్రజలకు స్పష్టంగా కనబడుతోందన్నారు. అలాగే అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అధికారంలో ఉండగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి తట్ట మట్టి కూడా వేయని బోండా ఉమా.. అజిత్ సింగ్ నగర్ లో మరో ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదమని మల్లాది విష్ణు అన్నారు. వీఎంసీ పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి అదంతా తమ క్రెడిట్ అన్నట్లుగా తెలుగుదేశం నాయకులు చేసుకుంటున్న పబ్లిసిటీ చూసి నగర ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్ లో మరోసారి ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి కోసం ముఖ్యమంత్రివర్యులు పడుతున్న తపన వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ ర్యాంక్‌ ప్రభుత్వానికి ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడంతో పాటు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్శిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు గుణదల ఆర్వోబీ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ అలసత్వం, చేతగానితనం వల్ల అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు. కానీ గుణదల ఆర్వోబీపై ప్రత్యేక శ్రద్ధతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.23 కోట్ల నిధులను మంజూరు చేశారని వెల్లడించారు. స్టేజ్ -2 పనులకు సంబంధించి నాబార్డు ద్వారా సుమారు రూ. 70 కోట్ల నిధులు మంజూరు అయినట్లు వివరించారు. ఆర్ఓబి పనుల వేగవంతంపై ఇటీవల కలెక్టర్ నేతృత్వంలో టెలీ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించుకున్నట్లు తెలిపారు. స్టేజ్ – 2 ల్యాండ్ అక్వైజిషన్ కు సంబంధించి ఇళ్లు నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవటానికి సిద్ధంగా ఉందని మల్లాది విష్ణు తెలిపారు. మొదటిదశగా ఇప్పటికే పలువురికి రూ.2 కోట్ల 10లక్షలు నష్టపరిహారంగా అందజేశామన్నారు. రెండో దశలో భాగంగా ఏలూరు రోడ్డులోని 27 సెంట్ల ప్రైవేటు భూమిలోని 114 ఇళ్లకు నష్టపరిహారంగా ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. వీలైనంత త్వరలో ఆర్ఓబి స్టేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కొంగితల లక్ష్మీపతి, బాలిగోవింద్, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు కొండా మహేశ్వర్ రెడ్డి, ఉద్ధంటి సురేష్, ఆళ్ల ప్రసాద్ రెడ్డి, యలమంద, భోగాది మురళి, గుండె సుందర్ పాల్, అలంపూర్ విజయ్, బంకా భాస్కర్, కొలకలేటి రమణి, తుంగం ఝాన్సీ, బండి వేణు, ఎల్ఐసి శివ, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *