Breaking News

పి.ఎం.ఎ.వై. ( పట్టణ) వై ఎస్ ఆర్ జగనన్న నగర్ టిడ్కో ఇళ్ళు పంపిణీ..

-3424 మందికి ఇళ్ళ పత్రాలు, తాళాలు అందజేసాం..
-ఇళ్ల నిర్మాణం కోసం రూ.4,500 కోట్లు వెచ్చించాం.
– పేదలకు స్వంత ఇంటి కలను నెరవేర్చి ఆస్తి హక్కు కల్పించాం …
-మంత్రులు ఆదిమూలపు సురేష్,
-సిహెచ్ వేణుగోపాల కృష్ణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు సొంతింటి కల సాకారం చెయ్యడం జరిగిందని, రూ.280 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించి వారి జీవితాల్లో ఆనందం సంతృప్తి కలిగిస్తోందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ , జిల్లా ఇంఛార్జి , రాష్ట్ర వెనుకబడిన తరగతుల, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ లు పేర్కొన్నారు.

శుక్రవారం స్థానిక బొమ్మూరు లోని వై యస్ ఆర్ జగనన్న కాలనీ లో లబ్ధిదారులకు ఇంటి పత్రాలు, తాళాలు అందచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో ఉన్న పేదల సొంత ఇంటి కల సాకారం చేసేందుకు తీసుకున్న శ్రద్ద తీసుకున్నామన్నారు. జిల్లాలో మొత్తం ఏడుప్రాంతాల్లో 6300 ఇళ్ళు నిర్మిస్తున్నారని ఇందులో ఇప్పుడు 3,424 ఇళ్లను పూర్తి స్థాయి లో అభివృద్ధి చేసి ఇవ్వడం జరుగుతోందన్నారు. గతంలో బ్యాంకు రుణాలు ద్వారా మీకు ఇళ్లు ఇవ్వటం అందుకోసం 50 వేలు , లక్ష రూపాయల చెల్లించాలని పేర్కొనడం జరిగిందన్నారు. అయితే జగనన్న రూ.1800 కోట్లు గత బకాయిలు చెల్లించి వీటి నిర్మాణం పూర్తి చెయ్యడం కోసం రూ.4500 కోట్లు ఖర్చు చెయ్యడం జరిగిందన్నారు. ఇళ్లు లేని వారికి సమాజంలో సరైన గౌరవం దక్కదు అన్నది వాస్తవం.. ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్న నానుడి తెలిసిందే అన్నారు. ఆ కలను సాకారం చేసేందుకు ఎంత బడ్జెట్ అయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో 2,62,000 వేల మంది కి సొంత ఇంటి పట్టాలు ఇస్తున్నామన్నారు. జగనన్న కాలనీ భవిష్యత్తులో ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరి జీవితాల్లో మూడు సార్లు సంతోషం కలుగుతుంది. ఒకటి బారసాల, రెండోది పెళ్లి, మూడోది సొంత ఇల్లు కల సాకారం అయినప్పుడు అన్నారు. ఈరోజు చాలా ఆనంద కరమైన రోజు, ఈ ఆనంద సమయంలో మీతో ఉండడం మరిచిపోలేని అనుభూతి ఇచ్చిందన్నారు. ఎటువంటి అవినీతికి తావులేకుండా సొంత ఇంటిని అందించడం జరుగుతోందన్నారు. అమ్మఒడి, జగనన్న ఆసరా, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాలు, నవరత్నాలు అందించడం ద్వారా మీ కళ్ళల్లో ఆనందం కోసం పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. అర్హులైన , పేద వారి వద్దకే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళలు పేరునే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న మన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ఎంపి మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, బొమ్మురు లో 3424 మందికి రాజమహేంద్రవరం లో పట్టాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఫేజ్- I లో బొమ్మూరు -2528, తొర్రేడు – 896 , మోరంపూడి డి బ్లాక్ -224, వడ్డేదర కాలనీ – 256 ప్లాట్లు అందించనున్నాము.

రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చేయడం జరుగుతొందన్నారు. యువతకు ముఖ్యమంత్రి జగనన్న ప్రోత్సాహము ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్ళ స్థలాల ఇవ్వడం జరుగుతోందన్నారు. గతంలో అసంపూర్తిగా ఇంటి నిర్మాణం విడిచి పెడితే, జగనన్న వాటి నిర్మాణం పూర్తి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామన్నారు. గత 3 సంత్సరకాలంలో రూ.1.46 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు అమలు చేసామన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులకు పథకాలు అమలు చేస్తూ, ఒక్క బటన్ నొక్కి వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నా మన్నారు.

టిడ్కో ఛైర్మన్ జే. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, మూడు సంవత్సరాలు అయింది కదా ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని అనుమానం కలగవచ్చు అన్నారు. ఇప్పుడు జగనన్న ,300 చ. అ. ఇంటిని ఉచితంగా ఇవ్వడం, రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారన్నారు. ఇందుకోసం రూ.280 కోట్లు ప్రభుత్వమే భరించడం జరుగుతోందన్నారు.

కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ఇళ్లు లేని పేదలందరికీ నవరత్నాలు లో స్థలాలు ఇవ్వటం జరిగింది, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ని పేదలందరికీ టిడ్కో ఇళ్ల ను ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సొంత ఇంటిలోకి చేరాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ కి కూతవేట దూరంలో ఈ కాలనీ ఉండడం తో మరింత ప్రాముఖ్యత పెరిగిందన్నారు.

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు.. లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, టిడ్కో చైర్మన్ జమ్మన ప్రసన్న కుమార్, రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, టిడ్కో డైరెక్టర్ జీ.నాగేశ్వరీ, టిడ్కో అధికారులు శ్రీధర్ రెడ్డి, రీటా, గోపాలకృష్ణ, శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *