Breaking News

ప్రత్యేక స్కూల్ హెల్త్ డ్రై వ్ కార్యక్రమం పై సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ యం. సుహాసిని ఆధ్వర్యంలో ది 11 -07 -20 22 తేదీ నుండి 25 -07 -2022 తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే ప్రత్యేక స్కూల్ హెల్త్ డ్రై వ్ కార్యక్రమం పై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రతి సచివాలయంలోని స్కూళ్లను ఆయా ఏఎన్ఎంలు సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్కూల్ హెల్త్ యాప్ ద్వారా విద్యార్థి వివరాలను మరియు ఆరోగ్య స్థితిగతులను పొందుపరిచి ముఖ్యంగా ఎనీమియా మానిటరింగ్ టూల్ ద్వారా రక్త పరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్ శాతాన్ని అందులో పొందుపరిచి ప్రతి లక్ష్మివారం వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కార్యక్రమం అమలును మరియు స్కూలు పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా నీటి నిలువలు ఉన్నట్లయితే వాటిని అప్లోడ్ చేయడం ద్వారా సంబంధిత పంచాయతీ వారికి చేరునట్లు తదనుగుణంగా పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడం మరియు స్కూలు పరిసర ప్రాంతాలు పారిశుధ్య నిర్వహణ అదే విధంగా దోమతెరలు వినియోగం ,అదేవిధంగా మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణ ,అమలుతీరు ,నాణ్యత పరిశీలన తదితర అంశాలను ఆయా సచివాలయం లోని స్కూల్ లను సందర్శించి యాప్ లో పొందుపరచడం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం సుహాసిని తెలియజేస్తూ ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి స్కూల్ నందు తల్లిదండ్రుల సమావేశంలో చర్చించుకుని ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా అమలయ్యే విధంగా వారి యొక్క ప్రోత్సాహం కూడా చాలా అవసరమని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కే సమన్వయ అధికారి డాక్టర్ మాధవి మరియు డిపిఓ ఉమామహేశ్వర రావు, గ్రామ వార్డు సెక్రటేరియట్ హెల్త్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *