Breaking News

ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ

-రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తొలి ఓటు వేయడంతో రాష్ట్రంలో ప్రారంభం అయిన ఎన్నికల ప్రక్రియ
-మొత్తం 175 మంది శాసన సభ్యుల్లో 173 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగం
-173 మంది సభ్యులో 172 మంది రాష్ట్రంలో, మరొకరు తెలంగాణా రాష్ట్రంలో ఓటుహక్కు సద్వినియోగం
-ఓటింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షించిన ఎన్నికల అబ్జర్వర్, ప్రత్యేక అధికారి మరియు స్టేట్ సి.ఇ.ఓ.

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాష్ట్రపతి ఎన్నికలు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగాయి. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభా భవనంలో సోమవారం ఉదయం 10.00 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తొలి ఓటుతో ప్రారంభం అయిన ఈ ఎన్నికలు సాయంత్రం 5.00 గంటల వరకూ కొనసాగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి ఓటు వేసిన అనంతరం శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంధ్రనాద్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, తానేటి వనిత, ఆర్.కె.రోజా, కె.వి.ఉష శ్రీచరణ్ తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తదుపరి మిగిలిన రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు ఈ ఓటింగ్ పక్రియలో పాల్గొన్నారు. ఈ విధంగా రాష్ట్రానికి చెందిన మొత్తం 175 మంది శాసన సభ్యుల్లో 173 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. వీరిలో 172 మంది రాష్ట్రంలో, మరొకరు తెలంగాణా రాష్ట్రంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

నిరంతర పర్యవేక్షణ నడుమ సాగిన ఎన్నికల పక్రియ…
ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతి, ఎన్నికల ప్రత్యేక అధికారి సంతోష్ అజ్మీరా మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె. రాజ్ కుమార్ నిరంతర పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత నడుమ రాష్ట్ర పతి ఎన్నికలు రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగాయి. మరో సహాయ రిటర్నింగ్ అధికారి వణితా రాణి ఈ ఎన్నికల పర్యవేక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పోలైన ఓట్ల బ్యాలెట్ బాక్సును డిల్లీకి పంపించేందుకు ఏర్పాట్లు…
రాష్ట్రపతి ఎన్నికల పక్రియ సాయంత్ర్రం 5.00 గంటలకు పూర్తయిన వెంటనే రాష్ట్రంలో పోలైన ఓట్ల బ్యాలెట్ బాక్సును ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె. రాజ్ కుమార్ సమక్షంలో సీళ్లు వేసి కట్టుదిట్ట భద్రత నడుమ శాసన సభా ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చారు. కట్టుదిట్ట భద్రత నడుమ మంగళవారం ఉదయం విమానంలో డిల్లీలోని పార్లమెంట్ భవనానికి పంపేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *