విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ధోబీ ఖానాలో 10లక్షల రూపాయలతో షేడ్స్ నిర్మాణ పనులకు మంగళవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకటసత్యం, స్థానిక కార్పొరేటర్ రెహానా నాహిద్, పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇక్కడ ప్రజలుకు ఇచ్చిన హామీకి కట్టుబడి ధోబీ ఖానా షేడ్స్ నిర్మాణం ప్రారంభించామన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో నియోజకవర్గం అభిరుద్ది చెందుతుంది అని అన్నారు. ధోబీ ఖానా షేడ్స్ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి వక్కరికి ధన్యవాదాలు తెలియపరు. అభిరుద్ది లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి నియోజకవర్గం లో ఎన్నో అభిరుద్ది పనులు చేపడుతుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ప్రతి హామీలను కార్పొరేషన్ లో అమలు చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తునంటే వాటి పైన కూడా సిగ్గు లేకుండా తెలుగుదేశం వారు నీచ రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొటే ప్రయత్నం చేస్తూ దిగజారుడు రాజకీయాలు ఈ రాష్ట్రం లో తెలుగుదేశం పార్టీ చేస్తోంది అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎంత రెచ్చ గోట్టాలని చుసిన, దిగజారుడు రాజకీయాలు చేసినా స్థానిక ప్రజలు వైసీపీ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి పైన స్థానిక నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ని తరిమి కొట్టి మా వెంట ఉన్న స్థానిక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని సమ్యసలు నిర్ములనకు ఎల్లపుడు కృషి చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ వలి, జగ్గా, సుభాని, చింతగుంటా విజయ,నాగు, రాము మరియు నాయకులూ కార్యకర్తలు పలుగ్గున్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …