-డిఆర్‌ఓ కె. మోహన్‌కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 24 అదివారం నిర్వహించే ఏపిపిఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్`3 (ఎండోమెంట్స్) ఉద్యోగ నియామక పరీక్షలకు కేంద్రాలలో తుది ఏర్పాట్లు పరిశీలించి సిద్దం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుండి ఏపిపిఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్`3 పరీక్షల నిర్వహణపై లైజన్ ఆఫీసర్స్ అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్స్ చీఫ్ సూపరిండెంట్స్ పోలీస్, ఆర్టీసీ మెడికల్ డిపార్ట్మెంట్ల అధికారులతో డిఆర్‌వో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌వో మోహన్‌కుమార్ మాట్లాడుతూ ఈనెల 24 ఆదివారం జరగనున్న ఏపిపిఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్`3 పరీక్షలను ముందస్తు ప్రణాళికతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలకు 10694. మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. అదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ నిర్వహించే ఈ పరీక్షలకు అభ్యర్థులు ఉదయం 10.45 గంటలలోపే పరీక్ష కేంద్రాలనికి హాజరుకావాలన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఫోటో గుర్తింపు కోసం పాస్ పోర్డ్ పాన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి తమతోపాటు తీసుకురావాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇందులో 19 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు అధికారులు సమన్వయంతో తుది ఏర్పాట్లను పరిశీలించి పరిక్షా కేంద్రాలను సిద్దం చేసుకోవాలన్నారు. అభ్యర్ధులు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ పరీక్షలకు హాజరవ్వాలన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఎక్కడ కూడా జిరాక్స్ కేంద్రాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డివో కె.మోహన్‌కుమార్ అన్నారు.