Breaking News

గిరిజనుల ఆర్థికాభివృద్ధికి నాబార్డు చేయూత… : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎ.కొండూరు జూలై 23 మెట్ట మండలమైన ఎ. కొండూరు లో గిరిజనులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనివారిఆర్థికాభివృద్ధికి వాసవ్య మహిళా మండలి నాబార్డ్ టి డి ఎఫ్ ప్రాజెక్ట్ సహకారంతో చేయూతనందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని కుమ్మరికుంట్ల తండా పంచాయతీ పరిధిలోని సింగ్లా తండాకు చెందిన గుగ్గులోతు లాలియ్య, బాలి దంపతులకు చెందిన మెట్ట పొలం లో మామిడి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం గ్రామ సర్పంచ్ గీతామహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ ఢిల్లీరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ మండలంలో గిరిజన తండాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. మండలంలో వరి, పప్పు ధాన్యాలు తక్కువగా పండించడంవల్ల గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందలేక పోతున్నారని వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వాసవ్య మహిళా మండలి వారు నా బార్డ్ సహకారంతో గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంత గిరిజనాభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించడమే కాకుండా, గొర్రెలు మేకల రుణాలు, కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగం కోసం వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేయించి జీవనోపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో 500 వందల కుటుంబాలకు గాను 500 ఎకరాల్లో మామిడి జామ, వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేయడానికి సహకారం అందించినట్లు తెలిపారు. రెండో విడతలో ఎ. కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో 514 కుటుంబాలను 500 ఎకరాల్లో మామిడి పంట సాగు చేయడానికి నాబార్డు ద్వారా రూ 3 కోట్ల 30 లక్షల రూపాయలు రుణ సహాయం అందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు 6 సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. మా తోట (వాడి) కార్యక్రమం ద్వారా గిరిజనులను చైతన్యపరిచి ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో నూజివీడు మామిడి కి ప్రసిద్ధిగా ఉండేదని, ప్రస్తుతం నాబార్డ్ సహకారం తో వాసవ్య మహిళా మండలి కృషితో ఈ ప్రాంతంలో కూడా పండ్లతోటలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. వీటిని గిరిజనులు సద్వినియోగ పరచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ మండలంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జల జీవన్ మిషన్ కమిటీ ద్వారా రూ 38 కోట్లతో స్వచ్ఛమైన కృష్ణాజలాలను అందించి కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఎం.ఎన్. కె. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి ప్రయాణీకుల, వాహనచోదకులు ఇబ్బందులను తొలగిస్తామన్నారు. అలానే గ్రామంలో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయిస్తామన్నారు. రబీ పంటకు సంబంధించిన రైతుల ధాన్యం సొమ్ములను రైతుల ఖాతాల్లో జమ చేయిస్తామని హామీ ఇచ్చారు. తిరువూరు డివిజన్ ఆర్డిఓ వై.ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం నాబార్డ్ ఎంతో సహకారం అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకొని జీవనోపాధి పొందాలని కోరారు. నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి మిలింద్ చౌసాల్ కర్ మాట్లాడుతూ మా తోట కార్యక్రమం ద్వారా రైతుల వాటర్ షెడ్ల నిర్మాణానికి, బోర్ వెల్స్ కు, మామిడి జామ తోటల పెంపకానికి, రుణాలు అందించామని వాటిని గిరిజనులు సద్వినియోగ పరచుకోవాలని కోరారు. వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి. కీర్తి మాట్లాడుతూ గతంలో స్వర్గీయ మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారి స్ఫూర్తితోనే స్వచ్ఛంద కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. గతంలో గిరిజనుల అభివృద్ధికి రూ 20 లక్షల రుణాలు మంజూరు చేస్తే నూటికి నూరు శాతం రుణాలు తిరిగి చెల్లించాలని ఆమె తెలిపారు. మా తోట కార్యక్రమాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి.రష్మీ, జెడ్ పి టి సి భూక్యా గనియా, ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి చెన్నారావు, వైస్ ఎంపీపీ గుంటక శివారెడ్డి, తహసీల్దార్ జి. బాలకృష్ణారెడ్డి, ఎంపీడీవో పి వి ఎస్ నాగేశ్వరరావు, ఈవో ఆర్ డి రాధిక, మండల వ్యవసాయా ధికారి షేక్ టిప్పు సుల్తాన్, పి ఆర్ ఏఈ సాంబశివరావు, వాసవ్య మహిళా మండలి మేనేజర్ కె. శ్రీనివాసరావు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *