Breaking News

సంక్షేమంతో 1.2 కోట్ల తెల్ల కార్డుల వారిని పేదరికం నుండి విడుదల చేశారా?

-ఆంధ్రప్రదేశ్ ఫ్రోఫెషనల్స్ ఫోరం డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మీ సంక్షేమ పథకాలతో ఎంతమందిని పేదరికం నుండి గట్టెక్కించారో తెలుపుతూ శ్వేత పత్రం విడుదల చేయగలరా? అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ నేతి ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రొఫెషనల్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 1.65 లక్షల కోట్లు సంక్షేమం చేస్తే రాష్ట్రంలో ఉన్న సుమారు 1.2 కోట్లు తెల్ల కార్డుల ప్రకారం ఒక్కొక్కరికి సరాసరిన 100000 / – పైన రావాలని మరి మీరిస్తున్న సరాసరి 30000 /- కూడా లేక పోవటం సంక్షేమం అర్హులైన పేదలకు చేస్తున్నారా?లేదా ప్రతి ఒక్కరికీ తాత్కాలిక ఓట్లు సీట్లు కోసం పంచారా మీరే చెప్పాలన్నారు. మరి ఇంత సంక్షేమం చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి కదా పెరిగింది జిడిఎస్ పి చుస్తే దారుణం 2019-2020 లో 4% శాతంఅలాగే 2020-2021 1% శాతం వుంది అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినట్టే కదా అన్నారు. సంక్షేమం అందిస్తే ఆర్థిక అసమానతలు తగ్గాలి కదా మరి సుమారుగా జిని ఇండెక్స్ 34 నుంచి 45-50 మధ్యలోకి పెరగడం చూస్తుంటే ఆర్థిక అసమానతలు పెరిగినట్టే కదా? సంబందించిన యువపారిశ్రామిక వేత్తలను ఒక్కరినన్న తయారు చేశారా అన్నారు.నైపుణ్యం పెంచే కారక్రమాలకు ఎంత ఎక్కడైనా ఆర్థిక అసమానతలు తగ్గించటానికి భూమిలేని పేదలకు భూమి ఇచ్చారా అలాగే బలహీన వర్గాలకు ఖర్చుపెట్టాడు పేదవర్గాల పెట్టిన విదేశీ విద్యకు ఎంత ఖర్చు పెట్టారు . పేదవర్గాల పెట్టిన కార్పొరేషన్స్ ల ద్వారా ఎంత రుణ సదుపాయం కల్పించారొ ,మైనారిటీ సోదరులకు స్వయం సంవృద్ధి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు . సరాసరి పెరిగిన ఖర్చులు పెరిగిన ఖర్చులతో మీరిచ్చిన లబ్ది మళ్లీ పెరిగిన వస్తువుల రూపంలో పోవడం లేదా ఇంకా మధ్యతరగతి కుటుంబాలు పెరిగిన ధరలతో పేదరికంలోకి నెట్టబడినట్టు కాదా జిని ఇండెక్స్ పెరిగింది అంటే అర్ధం పేదరికం పెరిగినట్టు కాదా అని అన్నారు. రాష్ట్రం అంటే ఇష్టపడే చార్టెడ్ అకౌంటెంట్ గా మేము ప్రభుత్వానికి విన్న వించుకునేది 1.65 లక్షల కోట్ల సంక్షేమానికి శ్వేత పత్రం విడుదల చేయ గలరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ కార్యదర్శి బొప్పన రాజశేఖర్ రావు సభ్యులు పిదికిటి మల్లికార్జునరావు సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *