రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ రోజు రాజమహేంద్రవరం కోర్టు ఆవరణలో రూ.37.80 లక్షలతో నిర్మించిన 8వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు-కమ్- మహిళలపై అఫెన్స్ కొరకు ప్రత్యేక కోర్ట్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రారంభించారు. శనివారం ఉదయం స్థానిక కోర్టు ప్రాంగణం లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు – జస్టిస్ డి వి ఎస్ ఎస్. సోమయాజులు, జస్టిస్ ఆర్. రఘునందనరావు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి – పి. వెంకట జ్యోతిర్మయి , తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
తొలుత కోర్టు ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా , రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు తూర్పు గోదావరి జిల్లా అడ్మనిస్ట్రేటివ్ న్యాయమూర్తి – జస్టిస్ డి. వి. ఎస్. ఎస్ సోమయాజులు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. రఘునందన రావు లకు కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వెంకట జ్యోతిర్మయి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇళ్ల శివ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, ఎస్పీ ఐశ్వర్యా రస్తోగి , మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, పలువురు న్యాయమూర్తి, బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంలో పలువురు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వీతెనియా మహాగొని మొక్కను, హై కోర్టు న్యాయమూర్తులు స్పతోడియా, తబుబియా మొక్కలను నాటారు.
తదుపరి రాజమహేంద్రవరం కోర్టు ఆవరణలో రూ.37.80 లక్షలతో నిర్మించిన 8వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు-కమ్- మహిళలపై అఫెన్స్ కొరకు ప్రత్యేక కోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మరియు తదితరులు ప్రారంభించడం జరిగింది.
రాజమండ్రీ బార్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా , రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు తూర్పు గోదావరి జిల్లా అడ్మనిస్ట్రేటివ్ న్యాయమూర్తి –జస్టిస్ డి వి ఎస్ ఎస్ సోమయాజులు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి – జస్టిస్ ఆర్. రఘునందన రావు, జిల్లా ప్రధాన నియమూర్తి – పి. వెంకట జ్యోతిర్మయి, కె. ప్రత్యూష కుమారి , జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు, నాగరాజు, బార్ సెక్రెటరీ మరియు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.